కన్నప్ప ఇండియా షూటింగ్ సంగతిదీ!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్ లోనూ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Jun 2025 6:00 PM ISTమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్ లోనూ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి సెట్లు లేకుండా రియల్ లోకేషన్స్ లో చిత్రీకరించారు. కథ అలాంటి లోకేషన్ డిమాండ్ చేయడం తో ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా పనిచేసారు. మంచు విష్ణు అయితే ఓ యజ్ఞంలా భావించి ఈ ఈ సినిమా పూర్తి చేసాడు. మిగతా 20 శాతం షూటింగ్ ఇండియాలో పూర్తి చేసారు. అయితే ఇక్కడ ఏ నటులపై చిత్రీకరించారు? అన్నది మాత్రం క్లారిటీ లేదు.
తాజాగా ఆ విషయాన్ని కన్పప్ప డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ రివీల్ చేసారు. ప్రభాస్ అక్షయ్ కుమార్ పై సన్నివేశాలు మాత్రమే ఇండియాలో షూట్ చేసారు. మిగతా అందరి నటీనటులపై న్యూజిలాండ్ లోనే షూటింగ్ చేసామన్నారు. ఆ రెండు పాత్రలకు భారతదేశం లొకేషన్లు డిమాండ్ చేయడంతో ఇక్కడ చేసిన ట్లు తెలుస్తోంది. అయితే ఇండియాలో ఏ ప్రాంతాల్లో షూటింగ్ చేసారు? అన్నది మాత్రం రివీల్ చేయలేదు.
ప్రభాస్ పాత్ర ఎంతో శక్తివంతంగా ఉంటుందన్నారు. యోధుడు, భక్తుడు పాత్రలో మంచు విష్ణు వందశాతం న్యాయం చేసారన్నారు. అలాగే ప్రతీ పాత్ర కథపైనా, ప్రేక్షకులపైనా ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తా యన్నారు. అభిమానులెవరు నిరాశ చెందరన్నారు. మోహన్ బాబు సినిమా చూసాన తనని కౌగిలిం చుకోవడం అన్నది అతి పెద్ద ప్రశసంగా భావిస్తున్నారు.
అలాగే భక్త కన్నప్ప జీవితంపై ఇది వరకూ వచ్చిన చిత్రాలు వేరుగా...కన్నప్ప వేరుగా ఉంటుందన్నారు. కథ ఒకేలా ఉన్నా పాత్రల్లో ఆత్మ మాత్రం భిన్నంగా ఉంటుందన్నారు. ఇప్పటికే కన్నప్పపై పాజిటివ్ బజ్ ఉంది. భారీ కాన్వాస్ పై చిత్రం తెరకెక్కడంతో పాన్ ఇండియాలో ఎలాంటి విజయం సాధిస్తుంది? అన్న ఉత్కంట నెలకొంది.
