కన్నప్ప ఫ్యూచర్ ప్లాన్స్ కూడా గట్టిగానే..
ఇక కన్నప్ప సినిమా టీజట్ లాంచ్, అమెరికాలో రోడ్‌షోలతో హైప్‌ను సృష్టించింది. 'కన్నప్ప' టీమ్ ప్రమోషన్స్‌లో ఎంతో వేగంగా దూసుకెళ్తోంది.
By: Tupaki Desk | 3 Jun 2025 9:48 AM ISTవిష్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ పాన్-ఇండియా చిత్రం భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో, మోహన్ బాబు నిర్మాణంలో రూపొందుతోంది. సినిమాలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 27న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక కన్నప్ప సినిమా టీజట్ లాంచ్, అమెరికాలో రోడ్‌షోలతో హైప్‌ను సృష్టించింది. ‘కన్నప్ప’ టీమ్ ప్రమోషన్స్‌లో ఎంతో వేగంగా దూసుకెళ్తోంది. భారీ స్కేల్‌లో షూటింగ్‌ను న్యూజిలాండ్, హైదరాబాద్‌లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్‌లాల్ కిరాటగా, ప్రభాస్ రుద్రగా నటిస్తున్న ఈ సినిమా, భక్త కన్నప్ప శివుని పట్ల అచంచలమైన భక్తిని, త్యాగాన్ని చూపించనుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, పోస్టర్‌లు అభిమానులను ఆకర్షించాయి, ఈ సినిమా విజువల్ గ్రాండియర్‌ను వాగ్దానం చేస్తున్నాయి. ఇక ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇండోర్‌లో భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అలాగే అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే, కొచ్చిలో మోహన్‌లాల్ మీడియా మీట్ నిర్వహించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలపనున్నారు.
ఇదివరకే మోహన్‌లాల్ తన కిరాట పాత్ర గురించి మాట్లాడుతూ, “ఈ సినిమా భక్తి, శౌర్యం, త్యాగం గురించి మాట్లాడుతుంది, నా పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది” అని వెల్లడించాడు. ఈ సినిమా కోసం టీమ్ గతంలో టీజర్ లాంచ్, అమెరికాలో రోడ్‌షోలను నిర్వహించింది. ఇప్పుడు ఇండోర్, కొచ్చిలో ఈవెంట్స్‌తో ప్రమోషన్స్‌ను మరింత జోరుగా సాగించనుంది.
ఇక ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న ఐదు భాషల్లో విడుదల కానుంది, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మొత్తంగా, ‘కన్నప్ప’ టీమ్ ప్రమోషన్స్‌తో దుమ్మురేపుతోంది. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ ఈవెంట్స్‌తో సినిమా హైప్ రెట్టింపు అవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
