మోహన్ బాబుపై కన్నప్ప డైరెక్టర్ కామెంట్స్..!
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది
By: Tupaki Desk | 21 Jun 2025 8:24 PMమంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈవెంట్ లో భాగంగా సినిమాలో నటించిన వారంతా పాల్గొన్నారు. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ తనకు కర్మ భూమి అయ్యిందని.. ఇది నా సెకండ్ హోం అని అన్నారు.
ముంబైలో ఉండే తాను ఇక్కడకు వచ్చి సినిమా తీయడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఆయన నాపై నమ్మకం ఉంచారు. మోహన్ బాబు గారు కోకోనట్ లాంటి వారు. పైకి గట్టిగా కనిపిస్తారు కానీ లోపల సున్నితంగా ఉంటారని అన్నారు కన్నప్ప డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. సినిమాలో మంచు విష్ణు పర్ఫార్మెన్స్ ట్రీట్ టు వాచ్ అన్నట్టుగా ఉంటుందని అన్నారు. మీరందరు కూడా విట్ నెస్ అవుతారని అన్నారు.
మీరంతా ప్రభాస్ కోసం క్యూరియాసిటీగా ఉన్నారు. సినిమాలో అన్ని పాత్రలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. అవి అన్నీ కథకు కనెక్ట్ అవుతాయని అన్నారు ముఖేష్ కుమార్ సింగ్. ఈ సినిమాతో ఎంతోమంది లెజెండ్స్ తో పనిచేసే అవకాశం వచ్చింది. మంచు విష్ణు హంబుల్ పర్సన్ సింపుల్ గా ఉంటారని అన్నారు ముఖేష్ కుమార్. సినిమాకు స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారని పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారని అన్నారు. ఈ సినిమాకు అతను పెద్ద ఎసెట్ అని అన్నారు కన్నప్ప డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్.
మహాభారతం సీరియల్ డైరెక్ట్ చేసి తన ప్రతిభ చాటిన ముఖేష్ కుమార్ సింగ్ కి కన్నప్ప సినిమా ఛాన్స్ ఇచ్చారు మోహన్ బాబు. సినిమాను ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో తెరకెక్కించారు. కన్నప్పగా మంచు విష్ణు తనని తాను మార్చుకున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. మరో వారం లో రిలీజ్ అవబోతున్న కన్నప్ప సినిమాపై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.