Begin typing your search above and press return to search.

కన్నప్పలో ప్రభాస్ వచ్చేదెప్పుడు?

మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా కన్నప్ప ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి బజ్ ను సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   19 Jun 2025 3:00 AM IST
కన్నప్పలో ప్రభాస్ వచ్చేదెప్పుడు?
X

మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా కన్నప్ప ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి బజ్ ను సొంతం చేసుకుంది. శివ భక్తుడు అయిన కన్నప్ప జీవిత కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్, ట్రైలర్ ద్వారా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో సినీప్రియుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్, నందీ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు.

ఈ సినిమా జూన్ 27న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే విష్ణు అమెరికాలో వివిధ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాకు పాజిటివ్ హైప్ తీసుకొస్తున్నారు. ట్రైలర్‌లోనూ భారీ యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ చూపించడంతో సినిమా విజువల్స్, స్కేల్ మీద అంచనాలు మరింతగా పెరిగాయి. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ అన్నీ కంటెంట్ బలం గురించి హింట్ ఇస్తున్నాయి.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ పాత్రకు సంబంధించిన క్లారిటీ బయటకు వచ్చింది. సినిమాలో ప్రభాస్ పాత్ర మొత్తం సెకండాఫ్‌లోనే వస్తుందట. అదీ కూడా దాదాపు అరగంట నిడివి ఉన్న పాత్ర అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అంటే అతను మామూలు గెస్ట్ అప్పీరియన్స్ కాదన్నమాట. కథకు కీలక మలుపు వచ్చే సమయంలో ప్రభాస్ పాత్ర ఎంటర్ అవుతుందని, కథను కొత్త దిశగా మలుపు తిప్పేలా ఉంటుందని తెలుస్తోంది.

ఈ మ్యాటర్ బయటకు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆనందం నెలకొంది. ఎందుకంటే ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్ గా ఉండబోతోందన్న మాట. ట్రైలర్‌లో చూపించిన రెండు సన్నివేశాలు ఈ పాత్ర బలాన్ని సూచిస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నందీ పాత్రగా ప్రభాస్ కనిపించడం విశేషం. ఇది కేవలం కమెర్షియల్ యాంగిల్‌కే కాకుండా, కథలోని భక్తిని సూచించే కీలక పాత్ర కావడం సినిమాకు పెద్ద ఎస్సెట్ అవుతుంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రమోషన్ పనులు కొనసాగుతున్నాయి. సినిమా విజువల్ ఎక్స్‌పీరియన్స్‌కు తగినట్టుగా టీమ్స్ పని చేస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే, ప్రభాస్ పాత్ర కేవలం స్టార్డం కోసమే కాకుండా కథలో కీలకంగా ఉండబోతుందన్న టాక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. కన్నప్ప సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.