Begin typing your search above and press return to search.

కన్నప్ప.. ప్రభాస్ వల్లే అదంతా: మంచు విష్ణు

వీరందరితోపాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేయడం విశేషం. రుద్ర క్యారెక్టర్ లో సినిమాలో సందడి చేశారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 12:20 AM IST
కన్నప్ప.. ప్రభాస్ వల్లే అదంతా: మంచు విష్ణు
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు లీడ్ రోల్ లో నటించిన కన్నప్ప.. ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మైథలాజికల్ అండ్ హిస్టారికల్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాకు హిందీ మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మంచు మోహన్ బాబు.. భారీ బడ్జెట్ తో నిర్మించారు.

టాప్ టెక్నీషియన్లు, స్టార్ సెలబ్రిటీలు మూవీ కోసం వర్క్ చేశారు. మోహన్ బాబు, శరత్‌ కుమార్‌, మధుబాల, ముకేశ్‌ రుషి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముకుందన్‌, సప్తగిరి, శివ బాలాజీ తదితరులు నటించారు. మాలీవుడ్ హీరో మోహన్‌ లాల్‌, బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ క్యామియో రోల్స్ లో కనిపించారు.

వీరందరితోపాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేయడం విశేషం. రుద్ర క్యారెక్టర్ లో సినిమాలో సందడి చేశారు. తనదైన నటన, డైలాగ్స్ తో అదరగొట్టారు. ఒక్కో సీన్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా యాక్ట్ చేసి తన టాలెంట్ తో మెప్పించారు. మొత్తానికి ప్రభాస్ రోల్.. సినిమాకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఎలిమెంట్ గా మారిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అదే సమయంలో ప్రభాస్ నటించడంతోనే కన్నప్పపై ఆడియన్స్ లో భారీ బజ్ క్రియేట్ అయిందని చెప్పాలి. మేకర్స్ కూడా ప్రమోషన్స్ లో ప్రభాస్ ప్రస్తావనే తీసుకొచ్చారు. అయితే సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ సాధించగా.. అది కూడా డార్లింగ్ వల్లేనని అటు సినీ వర్గాల్లో.. ఇటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ విషయంపై విష్ణు రెస్పాండ్ అయ్యారు.

కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.. వాటిపై ప్రభాస్ ఇంపాక్ట్ ఎంత ఉందని మీడియా ప్రతినిధి అడగ్గా.. 100 శాతం అని విష్ణు తెలిపారు. తాను అది నమ్ముతున్నానని అన్నారు. తనకెలాంటి ఇగో లేదని చెప్పారు. తన బ్రదర్ ప్రభాస్ వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పారు. ఆయన నటించడం వల్ల అంతా కన్నప్పపై ఇంట్రెస్ట్ చూపించారని అన్నారు.

ప్రభాస్ వల్ల అంతా కన్నప్ప చూశారని, కథ తెలుసుకున్నారని చెప్పారు. దీంతో ఒక్కసారిగా చప్పట్ల మోత మోగింది. దీంతో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేశారు విష్ణు. మొత్తానికి కన్నప్పకు ప్రభాస్ ఓకే చెప్పడం.. మేకర్స్ కు ప్లస్ పాయింట్ గా నిలిచింది. దీంతో క్రేజ్ అంటే అలా ఉండాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రభాసా మజాకా అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.