అక్షయ్-ప్రభాస్ కాంబినేషన్‌పైనే ఆసక్తి
మంచు విష్ణు- మంచు మోహన్ బాబుల డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప` ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Jun 2025 7:30 AMమంచు విష్ణు- మంచు మోహన్ బాబుల డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ ని అనుసరించి విష్ణు పెద్ద బడ్జెట్ ని రిస్క్ చేస్తున్నాడని అంతా భావిస్తున్నారు. ట్రైలర్ కి స్పందన బాగుంది. నిజానికి ఈ సినిమాలో భక్త కన్నప్పగా నటించిన మంచు విష్ణు పాత్రకు ప్యారలల్ గా శివుడిగా అక్షయ్ కుమార్, కన్నప్పను టెస్ట్ చేసే రుద్ర(మనిషిగా వచ్చే శివుడు)గా ప్రభాస్ నటించడం ఆసక్తిని కలిగించింది.
ఇది వింతైన క్రేజీ కాంబినేషన్! అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా అక్షయ్ - ప్రభాస్ కాంబినేషన్ పై ఆసక్తికర చర్చ సాగింది. బాలీవుడ్ లో దిగ్గజ హీరోగా దశాబ్ధాల పాటు కొనసాగిన అక్షయ్ కుమార్ ఒక తెలుగు సినిమాకి అంగీకరించడం గొప్ప అనుకుంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి అక్కీ నటించడం మరో హైలైట్. పైనుంచి ఆజ్ఞాపించే దేవుడు అక్షయ్ కుమార్ అయితే, భూమిపై భక్తుల్ని టెస్ట్ చేసే దేవుడు ప్రభాస్. ఇద్దరు దేవుళ్లు కన్నప్పకు పరీక్ష పెడుతూనే ఉంటారు.
అయితే ట్రైలర్ విడుదలయ్యాక, జనం ఎక్కువగా ప్రభాస్- అక్షయ్ గురించే మాట్లాడుతున్నారు. కన్నప్ప ట్రైలర్‌పై ఒక వ్యక్తి ట్వీట్ చేస్తూ, ``మహాదేవ్‌గా ఖిలాడీ .. రుద్రగా రెబల్ స్టార్ ఊహించని కలయిక, #అక్షయ్ కుమార్ .. #ప్రభాస్ ఒకే ఫ్రేమ్‌లో కలిసి ఉన్నారు. ఇది పవర్ ఫుల్ కాంబినేషన్. భవిష్యత్‌లో ఇద్దరూ కలిసి పూర్తి యాక్షన్ మూవీ చేస్తే? ఎలా ఉంటుంది! అనే ఆలోచన కూడా వచ్చింది. అయితే ఆ ఇద్దరినీ కలిపేందుకు సరైన దర్శకుడు, నిర్మాత అవసరం. సరైన బౌండ్ స్క్రిప్టు కూడా కుదరాలి. ప్రభాస్ గొప్పతనాన్ని బాలీవుడ్ స్టార్లు అంగీకరిస్తున్నారు కాబట్టి అతడితో కలిసి నటించడానికి వారికి అభ్యంతరం ఉండదు. ఇటీవల సౌత్- నార్త్ కలయికలో భారీ మల్టీస్టారర్లు తెరకెక్కడం ట్రెండ్ గా మారింది. ఇది త్వరలో విడుదలకు రానున్న `కన్నప్ప`కు ఏమేరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.