Begin typing your search above and press return to search.

ఓటీటీ ఒత్తిడికి తగ్గని విష్ణు.. 'కన్నప్ప'పై భారీ ధైర్యం!

విషయం ఏమిటంటే.. విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన కన్నప్ప సినిమా నేడు థియేటర్లలో విడుదల అవుతుంది.

By:  Tupaki Desk   |   27 Jun 2025 11:26 AM IST
ఓటీటీ ఒత్తిడికి తగ్గని విష్ణు.. కన్నప్పపై భారీ ధైర్యం!
X

ఇప్పటి కాలంలో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాక నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుండటంతో, థియేటర్ కలెక్షన్లు బాగా ప్రభావితమవుతున్నాయి. చాలా సినిమాలు స్ట్రీమింగ్ విండో ఒత్తిడిలో నష్టాలను భరించాల్సి వస్తోంది. డిజిటల్ హక్కుల వల్ల విడుదల తేదీ లాక్ చేసే స్వేచ్ఛ కూడా నిర్మాతల నుంచి పోయింది. ఈ పరిస్థితుల్లో నటుడు మంచు విష్ణు చేసిన ప్రకటన పరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది.

విషయం ఏమిటంటే.. విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన కన్నప్ప సినిమా నేడు థియేటర్లలో విడుదల అవుతుంది. అయితే, ఈ సినిమా థియేటర్లలో రిలీజైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుందని రూమర్స్ వస్తుండగా, విష్ణు ఆ ఊహలకు షాక్ ఇస్తూ, సినిమాను 10 వారాల తరువాతే ఓటీటీ లో విడుదల చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఓ మీడియా మీట్‌లో మాట్లాడిన విష్ణు ఈ విషయాన్ని వెల్లడించారు.

"ప్రేక్షకులకు థియేటర్లో సినిమా చూసే అనుభూతిని ఇవ్వాలన్నదే నా అభిప్రాయం. కనీసం పది వారాలు ఓటీటీకి వెళ్లదని స్పష్టంగా చెప్పగలను. నేను ఎలాంటి ఒత్తిడిలో కూడా లేను. నా డ్రీమ్ ప్రాజెక్ట్‌ను త్వరగా ఓటీటీలో పెట్టి ఆ విలువను తగ్గించాలనుకోవడం లేదు," అని విష్ణు స్పష్టం చేశారు. దీంతో, తాజాగా సినిమా ప్రమోషన్స్ లోనే కొత్త కోణం చర్చనీయాంశంగా మారింది.

కన్నప్ప సినిమాపై ఇప్పటివరకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ప్రత్యేకంగా ప్రభాస్ ఇందులో రుద్రునిగా కనిపించబోతున్నాడు. ఇదే ఆడియెన్స్‌లో ఆసక్తి పెంచుతోంది. మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందించిన ఈ పౌరాణిక చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా మిగతా భాషలలో కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, విష్ణు తీసుకున్న నిర్ణయం కమర్షియల్ గా చాలా రిస్క్‌తో కూడినదే అయినా, సినిమా మీద ఆయనకు ఉన్న నమ్మకాన్ని హైలెట్ చేస్తోంది. పైగా, ఇటీవల కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ ప్రెజర్ వల్ల నష్టపోయిన సందర్భాల్లో కన్నప్పది డిఫరెంట్ అనుభవంగా మారనుంది.

విశేషమేమిటంటే, ఓటీటీ ఒత్తిడి లేని ఈ స్ట్రాటజీ సినిమాకు మొదటి రెండు వారాల కలెక్షన్లపై గణనీయమైన ప్రభావం చూపించనుంది. ఈ నిర్ణయం విజయవంతమైతే, ఫ్యూచర్‌లో మిగతా నిర్మాతలకూ మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి విష్ణు ధైర్యంగా తీసుకున్న నిర్ణయం పాజిటివ్‌గా మారితే, కన్నప్ప తన కెరీర్‌ను మలుపుతిప్పే సినిమాగా నిలవడం ఖాయం.