కన్నప్ప ట్రైలర్: ప్రభాస్ సర్ ప్రైజ్ తో విష్ణు పవర్ఫుల్ కంటెంట్
ఇప్పటికే టీజర్ సాంగ్స్ ద్వారా సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా అసలైన ట్రైలర్ ను విడుదల చేశారు.
By: Tupaki Desk | 14 Jun 2025 7:35 PM ISTమంచు విష్ణు కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మంచు విష్ణు సొంత సంస్థలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఇక దాదాపు ఆరు నెలల నుంచి సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ సాంగ్స్ ద్వారా సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా అసలైన ట్రైలర్ ను విడుదల చేశారు.
చాలామంది ఆడియన్స్ ట్రైలర్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సినిమాలో నెవ్వర్ బిఫోర్ అనేలా భారీ క్యాస్టింగ్ హైలెట్ కాబోతున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ తో పాటు పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ కూడా ఇందులో నటించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి పెరిగింది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే అనుకున్నట్లే ఈ సినిమాపై అంచనాల స్థాయిని మరో లెవల్ కు తీసుకు వెళ్లేలా కనిపిస్తోంది. సినిమాలో నిజమైన భక్తకన్నప్ప స్టోరీని నేటి వర్గం ప్రేక్షకులకు అర్థమయ్యేలా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా సెట్స్ లేకుండా గ్రీనరీ బ్యాక్ గ్రౌండ్ లో చాలా ఎట్రాక్టివ్ గా ఈ సినిమాను షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మొదట శివుడంటేనే రాయి అని అనుకున్న తిన్నడు ఆ తర్వాత మహా భక్తకన్నప్పగా ఎలా మారాడు అని అంశం ట్రైలర్ లో బాగా హైలైట్ అయింది.
ఇక ప్రత్యేకమైన వాయు లింగం కోసం కొంతమంది శత్రువులు దాడి చేయడం.. ఇక వారిని అడ్డుకునే విధంగా కన్నప్ప పోరాటం కూడా ట్రైలర్ లో చూపించారు. చూస్తుంటే సినిమాలో భక్తితో పాటు మంచి యుద్ధ సన్నివేశాలు, ఫైట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడ తగ్గకుండా సినిమా విజువల్స్ కోసం భారీగానే ఖర్చు చేసినట్లుగా అర్థం అవుతుంది.
ఇక శివుడిగా అక్షయ్ కుమార్ పర్ఫెక్ట్ అనిపిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా ఒక చిన్న ఫ్రేమ్ లోనే ఎంతో గానో ఎట్రాక్ట్ చేసింది. ఇక రుద్ర పాత్రలో ప్రభాస్ పాత్ర కూడా కథలో ఎంతో కీలకమని రెండు మూడు సన్నివేశాలతోనే క్లారిటీ ఇచ్చేశారు. అతని పాత్ర కేవలం గెస్ట్అపీరియన్స్ కోసం కాకుండా కథలో భాగంగా కన్నప్ప జీవితాన్ని మలుపు తిప్పే అంశంగా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది.
విష్ణు ప్రభాస్ మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మోహన్ లాల్ పాత్ర కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. ఇక మోహన్ బాబు క్యారెక్టర్ డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. డైలాగ్స్ విషయంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒరిజినల్ కంటెంట్ ఫీల్ ను ఏ మాత్రం తగ్గించకుండా నేటితరం ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కన్నప్ప సినిమాను రూపొందించినట్లుగా ఈ ట్రైలర్ చూపించింది. సినిమాను ఈ నెల 27వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
