'కన్నప్ప' డైరెక్టర్ని వెతికి పట్టుకుంది పెద్దాయనా!
తానే కర్త, కర్మ, క్రియగా పని చేసాడు. సినిమాలో కొన్ని సన్నివేశాల్ని కూడా తానే స్వయంగా డైరెక్ట్ చేసినట్లు రివీల్ చేసాడు.
By: Tupaki Desk | 9 Jun 2025 11:49 AMమంచు విష్ణు కథానాయకుడిగా నటించిన `కన్నప్ప` రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవలే గుంటూరులో గ్రాండ్ గా ఈవెంట్ కూడా నిర్వహించారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు లాంటి స్టార్లతో భారీ కాన్వాస్ పై తెరకెక్కిన చిత్రమిది. మోహన్ బాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మంచు ఫ్యామిలీకి ఈ సినిమా ఓడ్రీమ్ ప్రాజెక్ట్ . ఈ సినిమా కోసం స్వయంగా విష్ణు కలం పట్టాడు.
తానే కర్త, కర్మ, క్రియగా పని చేసాడు. సినిమాలో కొన్ని సన్నివేశాల్ని కూడా తానే స్వయంగా డైరెక్ట్ చేసినట్లు రివీల్ చేసాడు. ఈ సినిమాతో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ఇతను ఎవరు? అన్నది ఎవరికీ తెలియదు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పనులన్నింటిని విష్ణు చూసుకున్నాడు. దీంతో డైరెక్టర్ ఎంపిక కూడా అతడి చేతలు మీదుగా జరిగిందనుకున్నారంతా. కానీ ఆ ఛాన్స్ విష్ణు తీసుకోలేదు.
నిర్మాతగా వ్యవహరించిన మోహన్ బాబు తీసుకున్నట్లు గుంటూరు ఈవెంట్లో ఆయనే స్వయంగా రివీల్ చేసారు. ముఖేష్ కుమార్ సింగ్ ని డైరెక్టర్ గా తీసుకుందామని విష్ణుకు చెబితే తండ్రి మాటకు కట్టుబడి అతడు ఎవరు? ఏంటి? అనుభవం ఇలాంటి ఏ విషయాలు కూడా విష్ణు అడగకుండానే తాను రాసిన కథను ముఖేష్ కుమార్ సింగ్ చేతుల్లో పెట్టినట్లు మోహన్ బాబు ఓపెన్ అయ్యారు.
ఓపెద్ద ప్రాజెక్ట్ ను మోహన్ బాబు చేతుల్లో పెట్టారంటే ఆయన అన్ని రకాలుగా ముఖేష్ ని పరీక్షించే ఉంటారు. నటుడిగా మోహన్ బాబుది ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్తానం. ఎన్నో సినిమాల్లో న టించారు. మరెన్నో వైవిథ్యమైన పాత్రలతో డైలాగ్ కింగ్ గా ఫేమస్ అయ్యారు. నిర్మాతగానూ ఎన్నో సినిమాలు నిర్మించారు. ఆ అనుభవాన్నంతటిని రంగరించి ఎంతో నమ్మకంతో ముఖేష్ కుమార్ సింగ్ ని డైరెక్టర్ గా ఎంపిక చేసారు. మరి మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ ను ముఖేష్ ఎంత అద్భుతంగా తీసాడో తెలియా లంటే జూన్ 27 వరకూ వెయిట్ చేయాల్సిందే. పాన్ ఇండియాలో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.