Begin typing your search above and press return to search.

ప్రభాస్‌.. పారితోషకం అడిగితే చంపేస్తా అన్నాడట!

తాజాగా విష్ణు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   29 May 2025 10:00 PM IST
ప్రభాస్‌.. పారితోషకం అడిగితే చంపేస్తా అన్నాడట!
X

పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న కన్నప్ప సినిమాకు సంబంధించి ప్రతి రోజు కొత్తగా ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. డైనమిక్ స్టార్ విష్ణు మంచు నటిస్తూ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగణం కలవడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ప్రభాస్ పాత్ర ఈ సినిమాకే కాదు, బిజినెస్‌కే పెద్ద బలంగా మారిందని అందరూ అంగీకరిస్తున్నారు.

తాజాగా విష్ణు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్‌ పారితోషకం అంశం చర్చనీయాంశంగా మారింది. అరగంట నిడివి ఉన్న ప్రత్యేక పాత్రను చేయడానికి ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నాడన్నదే అందరికీ డౌట్. కానీ ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్న సంగతి బయటపడడంతో అందరూ షాక్ అయ్యారు. అంతటి స్టార్ కూడా డబ్బుల గురించి పట్టించుకోకుండా నటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అయింది.

ఇక్కడే విష్ణు చెప్పిన ఆసక్తికర విషయం వైరల్ అయింది. ప్రభాస్‌కు రెమ్యూనరేషన్ ఇవ్వాలనుకున్న విష్ణు ఎన్నిసార్లు అడిగినా, లైట్ అన్నట్లు ప్రభాస్ దాన్ని తేలికగా తీసేవాడట. చివరికి ఈ విషయంలో మోహన్‌బాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందట. మోహన్‌బాబు - ప్రభాస్ వద్దకు వెళ్లి రెమ్యూనరేషన్ విషయం ప్రస్తావించగానే, “ఇంకోసారి ఈ మాట ఎత్తితే విష్ణును చంపేస్తానని చెప్పండి” అంటూ నవ్వుతూ సీరియస్‌గా సమాధానం ఇచ్చాడట ప్రభాస్. ఈ మాటలు వింటేనే వారి బాండింగ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.

అంతేకాదు, మోహన్‌లాల్ కూడా ఈ సినిమాకి, డబ్బులు తీసుకోలేదట. రెమ్యునరేషన్ సంగతి ‘నాతోనే మాట్లాడు’ అని మేనేజర్ అవసరం లేదన్నట్లు చెప్పారు. పైగా రెమ్యూనరేషన్ విషయాన్ని ప్రస్తావించగానే, "ఇంత పెద్దవాడివి అయిపోయావా నన్ను డబ్బులు అడగడానికి?" అంటూ ఆయన కాస్త ప్రేమతోనే తిరగబడ్డారట. దీనిని విష్ణు ఎంతో ఆవేశంగా వివరించాడు. మలయాళ లెజెండ్ అయిన మోహన్‌లాల్ కూడా ఎలాంటి పారితోషకం తీసుకోకపోవడం సినీ ప్రియులను ఆకట్టుకుంది.

అక్షయ్ కుమార్ మాత్రం ఈ సినిమాలో తన పాత్రకు తగిన పారితోషకం తీసుకున్నాడు కానీ, అతను సాధారణంగా తీసుకునే రెమ్యూనరేషన్‌తో పోలిస్తే అది తక్కువే అని విష్ణు వివరించాడు. కాని మిగిలిన స్టార్‌లతో పోలిస్తే అక్షయ్ కూడా ఈ సినిమాలో నమ్మకంతో భాగమయ్యాడు అనే మాట వినిపిస్తోంది. ఇలాంటి ప్రముఖులు డబ్బుల కోసం కాకుండా, కథ కోసం, విష్ణుతో ఉన్న బాండింగ్ కోసం ముందుకు రావడం ఇండియన్ సినిమాకే గర్వకారణంగా మారింది.

ఈ స్థాయిలో స్టార్స్ సహకారం అందించడంతో కన్నప్ప సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు మంచు ఈ ప్రాజెక్ట్‌ను తన డ్రీమ్ ప్రాజెక్టుగా తీసుకుని అద్భుతంగా మలచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. మరి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.