'కన్నప్ప'లో మంచు వారమ్మాయిలు!
ఇక సినిమా కు కర్త, కర్మ, క్రియగా విష్ణు పనిచేసాడు. తానే స్వయంగా ఈ సినిమా కథ సిద్దం చేసాడు. అందులో మెయిన్ లీడ్ పోషించాడు.
By: Tupaki Desk | 23 Jun 2025 3:00 AM ISTమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారం పనులు కూడా మొదలయ్యాయి. పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. దీంతో సినిమాపై మంచు అండ్ కో ఎంతో నమ్మకంగా ఉంది. ప్రత్యేకంగా విష్ణు చాలా నమ్మకంగా ఉన్నాడు. పెద్ద హిట్ కొట్టబోతున్నామని ముందే హింట్ ఇచ్చారు.
ఇక సినిమా కు కర్త, కర్మ, క్రియగా విష్ణు పనిచేసాడు. తానే స్వయంగా ఈ సినిమా కథ సిద్దం చేసాడు. అందులో మెయిన్ లీడ్ పోషించాడు. క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాలు కూడా తానే స్వయంగా డైరెక్ట్ చేసినట్లు చెప్పాడు. ఇలాంటి ఆసక్తికర విషయాలెన్నో 'కన్నప్ప'లో ఉన్నాయి. వాటన్నింటికి జూన్ 27న తెరపడుతుంది. అలాగే సినిమాలో ఓ కీలక పాత్రలో మోహన్ బాబు కూడా కనిపిస్తారు.
అంతేకాదు విష్ణు పిల్లలు కూడా సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విష్ణు కూడా కన్పమ్ చేసాడు. 'కన్నప్పలో మాముగ్గురు పిల్లలు నటించారు. మా అమ్మాయిలు తెరపై కనిపించబోతున్నారు అన్న ఉత్సాహం ఓవైపు ఉంటే అంత ఎండలో వాళ్లు ఎలా పనిచేస్తారనే ఆందోళన కలిగింది. షూట్ అయ్యాక ఆ విజువల్స్ చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలనిపించింది. అంత బాగా పాట పాడి డాన్సు చేసారిద్దరు.
మా బాబుకి కూడా ఆసక్తి ఉండటంతో తను కూడా నటించాడని' విష్ణు తెలిపాడు. దీంతో కన్నప్పలో చాలా విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో మంచు లక్ష్మి కూడా నటించారా? అన్న సం దేహం కూడా ఉంది. కానీ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
