కన్నప్ప.. బుక్ మై షోలో బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..
తాజాగా ఈ మూవీ బుక్ మై షో లోనే 5 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయన్న వార్త ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తుతోంది.
By: Tupaki Desk | 1 July 2025 2:45 PM ISTటాలీవుడ్‌లో పౌరాణిక చిత్రాలకి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు కమర్షియల్ కథలే హవా చూపుతున్న ఈ తరుణంలో భక్తిరసంతో తెరకెక్కిన సినిమా కన్నప్ప అందరి దృష్టిని ఆకర్షించింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలకు ముందే విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా ఈ మూవీ బుక్ మై షో లోనే 5 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయన్న వార్త ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తుతోంది. ఈ మూవీ ఫస్ట్ డే నుంచి మంచి వసూళ్లు రాబడుతూ, పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన వీకెండ్ లోనే సాలీడ్ కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు టాక్.
మొదటిరోజే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల హౌస్‌ఫుల్ షోలను నమోదు చేసింది. ఇప్పుడు బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే 5 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయంటే.. సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి హీరో విష్ణు ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ప్రభాస్ స్పెషల్ రోల్, భారీ విజువల్స్, శివ భక్తిని ప్రధానంగా చూపించడం వంటివే.
ముఖ్యంగా మల్టీ లాంగ్వేజ్ రీలీజ్ తో ఉత్తరభారత ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరుసటి రోజుకు హిందీ వెర్షన్ కలెక్షన్లు 40% పెరిగాయంటే... మాటలకందని రెస్పాన్స్ స్పష్టమవుతోంది. తమిళ, మలయాళ వెర్షన్లకూ మంచి ఆదరణ కనిపిస్తోంది. ఈ చిత్రం ద్వారా మంచు విష్ణు తన కెరీర్‌లో పెద్ద హిట్ అందుకున్నట్టే కనిపిస్తోంది.
భక్తిరసం, విజువల్ గ్రాండియర్, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఇది మంచి లాంగ్ రన్ చూపే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వారం కలెక్షన్లతో సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి కన్నప్ప టైటిల్‌కు అనుగుణంగా గర్వించదగ్గ ఘన విజయాన్ని అందుకుంటోంది. యూత్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకూ ఈ మూవీని ఆస్వాదిస్తున్నారు. త్వరలో మేకర్స్ నుంచి వసూళ్లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రావొచ్చని తెలుస్తోంది.
