Begin typing your search above and press return to search.

'కన్నప్ప' గ్లింప్స్.. మరో పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చేసింది

జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ స్పెషల్ గ్లింప్స్ వాటిని మరింత పెంచేలా చేశాయి.

By:  Tupaki Desk   |   21 May 2025 10:00 AM
కన్నప్ప గ్లింప్స్.. మరో పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చేసింది
X

పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సాలీడ్ స్టార్ క్యాస్ట్ తో రూపొందుతున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా మరో ప్రముఖ నటుడికి సంబంధించిన స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చేశారు. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ పుట్టినరోజును పురస్కరించుకుని, విష్ణు మంచు అంబిషస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.


జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ స్పెషల్ గ్లింప్స్ వాటిని మరింత పెంచేలా చేశాయి. గ్లింప్స్‌ చూస్తేనే సినిమా స్థాయికి అర్థమవుతుంది. మోహన్‌లాల్ ఈ చిత్రంలో కిరాత అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. గడ్డంతో కూడిన వయస్సు మించిన యోధుడిగా కనిపించిన ఆయనకు వేషధారణలోనూ, మేకోవర్‌లోనూ భారీ మార్పు కనిపించింది.

కేవలం 30 సెకన్లలోని ఈ వీడియోలో ఆయన కళ్ల అభినయంతో, స్క్రీన్‌ ఫుల్‌గా నిండిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ విజువల్‌ను మరింత పవర్ఫుల్ గా హైలెట్ అయ్యింది. అలాగే టీజర్ లో విష్ణు క్యారెక్టర్ కు సంబంధించిన షాట్స్ కూడా హైలెట్ అయ్యాయి. విష్ణు మంచు ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నట్లు అర్ధమవుతుంది.

మోహన్‌లాల్ వంటి లెజెండరీ యాక్టర్‌ను యథాతథంగా చూపించటమేకాకుండా, ఆయన కెరీర్‌లో మరో పవర్‌ఫుల్ రోల్‌గా నిలిచేలా ప్రెజెంట్ చేయడంలో టీం విజయం సాధించింది. గ్లింప్స్ చివర్లో వచ్చే సీన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో విడుదలైన తరువాతే అభిమానుల నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

యూట్యూబ్‌లో కేవలం కొన్ని గంటల్లోనే అద్భుతమైన రెస్పాన్స్ తో, ఈ వీడియో విపరీతమైన పాపులారిటీ సాధించింది. ఇతర పాత్రలకు సంబంధించి ఇప్పటికే ఆసక్తికర స్పందన లభించింది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి తారాగణం ఉండటంతో, ఈ సినిమా మరో హై లెవెల్ ఫిల్మ్ అవుతుందనే బజ్ మొదలైంది. మ్యూజిక్, విజువల్స్, యాక్షన్ సన్నివేశాల గురించి టీం వేరే లెవెల్ ఫీల్ ఇచ్చేలా ప్లాన్ చేసింది. ఇదంతా చూస్తుంటే జూన్ 27న తెలుగు తెరపై ఒక బిగ్ బాక్సాఫీస్ తరహా విజయం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ గ్లింప్స్‌తో ‘కన్నప్ప’ ప్రమోషన్ మరో మెట్టు ఎక్కింది. మోహన్‌లాల్ పాత్ర కిరాతగా ముద్ర వేసింది. మరి ఈ వారియర్ పాత్ర సినిమాకు ఎంత పవర్ జోడిస్తుందో రిలీజ్ అనంతరం తేలనుంది.