Begin typing your search above and press return to search.

కన్నప్ప సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అయిందా? ఏం జరిగింది?

అదే సమయంలో కన్నప్ప మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డ్రైవ్ పట్టుకుని ఇద్దరు పరారయ్యారన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

By:  Tupaki Desk   |   27 May 2025 12:24 PM IST
కన్నప్ప సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అయిందా? ఏం జరిగింది?
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఆ మూవీ జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నార్త్ టు సౌత్ అనేక మంది స్టార్ నటీనటులు భాగమైన ఆ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.

అదే సమయంలో కన్నప్ప మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్న హార్డ్ డ్రైవ్ పట్టుకుని ఇద్దరు పరారయ్యారన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. కంటెంట్ ఉన్న హార్డ్ డిస్క్ ను ముంబైకు చెందిన వీఎఫ్ ఎక్స్ కంపెనీ.. హైదరాబాద్ కు కొరియర్ లో పంపింది. ఆ హార్డ్ డిస్క్ ను ఆఫీస్ బాయ్ రఘు తో పాటు మరో మహిళ దాచేశారు అని అంటున్నారు.

దీంతో వారిద్దరూ తప్పించుకుని తిరుగుతుండగా.. ఫిల్మ్ నగర్ పోలీసులకు కన్నప్ప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఎవరి మార్గదర్శకత్వంలో సినిమా నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు, చరితలు కలిసి ఇలా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు.

సినిమాలో కీలక కంటెంట్ ఉందని విజయ్ కుమార్ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం నిజమేనని.. కానీ అందులో ఏ కంటెంట్ అనేది ఇంకా తెలియదని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్ కు హార్డ్ డిస్క్ వ్యవహారం తలనొప్పిగా మారిందని చెప్పాలి.

ఇక మూవీ విషయానికొస్తే.. కన్నప్ప రోల్ లో మంచు విష్ణు కనిపించనున్నారు. మహా శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించారు. కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా యాక్ట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ వంటి పలువురు భారీ స్టార్స్ భాగమయ్యారు.

మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను డైలాగ్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. స్టీఫెన్ దేవసి ఆ చిత్రానికి మ్యూజిక్ అందించారు. గ్రాండ్ విజువల్స్ అండ్ భారీ వీఎఫ్‍ఎక్స్‌ సినిమాలో ఇప్పటికే ఉండనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. మరి మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కన్నప్ప ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.