కన్నప్ప హార్డ్ డిస్క్.. మనోజ్ ఎనదర్ కామెంట్..!
కన్నప్ప గురించి మనోజ్ మాట్లాడిన ప్రతిసారి సూపర్ బజ్ ఏర్పడుతుంది. ఐతే మనోజ్ ఫైనల్ కామెంట్స్ కన్నప్పకు పాజిటివ్ గా మారే అవకాశం ఉంది.
By: Tupaki Desk | 1 Jun 2025 12:06 AM ISTమంచు విష్ణు నటించి నిర్మించిన కన్నప్ప సినిమాకు సంబందించిన హార్డ్ డిస్క్ ఇష్యూ తెలిసిందే. ఐతే ఇది ఆ యూనిట్ కి చాలా సీరియస్ మ్యాటర్ కాగా మిగతా వారికి మాత్రం అదో ఫన్నీ సబ్జెక్ట్ గా మారింది. ముఖ్యంగా మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ కూడా కన్నప్ప గురించి మాట్లాడటం తో వ్యవహారం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది.
మంచు మనోజ్ రీసెంట్ గా భైరవం సినిమాలో నటించాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మంచు మనోజ్. విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన భైరవం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు టాక్ పర్వాలేదన్నట్టు వచ్చింది. ఆఫ్టర్ రిలీజ్ భైరవం సక్సెస్ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మరోసారి కన్నప్ప గురించి మాట్లాడారు.
ప్రెస్ మీట్ లో మంచు విష్ణుకి ఒక రిపోర్టర్ కన్నప్ప హార్డ్ డిస్క్ గురించి అడిగితే.. అది మీకు ఇచ్చా కదా అని అన్నారు మంచు మనోజ్. ఇక జోక్స్ ఆపేసి భైరవం సక్సెస్ మూడ్ లో పాజిటివ్ గా ఉన్నాం. సో ఒక సినిమా కోసం ఎంతోమంది కష్టపడి పనిచేస్తారు. అందుకే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి కన్నప్ప సినిమా కూడా గొప్ప విజయం సాధించాలని కోరుతున్నా అని అన్నారు మంచు మనోజ్.
కన్నప్ప గురించి మనోజ్ మాట్లాడిన ప్రతిసారి సూపర్ బజ్ ఏర్పడుతుంది. ఐతే మనోజ్ ఫైనల్ కామెంట్స్ కన్నప్పకు పాజిటివ్ గా మారే అవకాశం ఉంది. మిగతా విషయాలు ఎలా ఉన్నా సినిమా సక్సెస్ అవ్వాలంటే అందరు ప్రోత్సహించాలి. సో మంచు విష్ణు మంచు మనోజ్ ఫ్యామిలీ గొడవలు ఎలా ఉన్నా సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకోవడం గొప్ప విషయం. కన్నప్ప సినిమా ఇప్పటికే చాలా సార్లు వార్తల్లో నిలిచింది. లేటెస్ట్ హార్డ్ డిస్క్ ఇష్యూ కూడా మరోసారి హెడ్ లైన్స్ లో నిలబెట్టింది. ఓ విధంగా చెప్పాలంటే సినిమాకు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. మరి ఫైనల్ గా సినిమా ఏం చేస్తుందో చూడాలి.
ఇదిలాఉంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మంచు మనోజ్ భైరవంతో మంచి కంబ్యాక్ ఇచ్చినట్టె.. నెక్స్ట్ మిరాయ్ లో అదిరిపోయే రోల్ చేస్తున్నాడు. మంచు విష్ణు కూడా కన్నప్ప కోసం తన శాయశక్తులా కృషి చేస్తున్నాడు. మరి ఆ శివయ్య మంచు విష్ణుకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాడో చూడాలి.
