Begin typing your search above and press return to search.

కన్నప్పకు సడన్ బ్రేక్.. క్షమించండి అంటూ విష్ణు క్లారిటీ!

శివుడి భక్తుడైన కన్నప్ప కథను భారీ బడ్జెట్, టాప్ టెక్నికల్ విలువలతో రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 March 2025 6:55 PM IST
కన్నప్పకు సడన్ బ్రేక్.. క్షమించండి అంటూ విష్ణు క్లారిటీ!
X

పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న సినిమా కన్నప్ప. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శివుడి భక్తుడైన కన్నప్ప కథను భారీ బడ్జెట్, టాప్ టెక్నికల్ విలువలతో రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల ప్రత్యేక పాత్రలతో ఈ ప్రాజెక్ట్‌ను ఊహించని స్థాయిలో తీర్చిదిద్దేందుకు మేకర్స్ ఎంతో శ్రమిస్తున్నారు.


ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే శివుడి సాంగ్ తో పాటు మరో లవ్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అలాగే ఎప్పటికప్పుడు పోస్టర్స్ తో కూడా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

అసలైన ప్లాన్ ప్రకారం కన్నప్ప ఏప్రిల్ 25న విడుదల కావాల్సింది. కానీ తాజాగా విష్ణు మంచు తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఒక ప్రకటనను జారీ చేశారు. ఇందులో ఆయన ఫ్యాన్స్‌కు ప్రేక్షకులకు ఓ సారీ చెప్పారు. “ఈ ప్రయాణం గొప్పదైంది. కానీ ఒక కీలక ఎపిసోడ్‌కి అవసరమైన VFX వర్క్ కోసం కొన్ని వారాలు టైం కావాలి. అందుకే రిలీజ్ కొద్దిగా వాయిదా వేస్తున్నాం,” అని పేర్కొన్నారు.

విష్ణు మాట్లాడుతూ, ఈ సినిమా లార్డ్ శివుడికి అంకితంగా తెరకెక్కుతోందని, అందుకే ప్రతీ ఫ్రేమ్‌ని అత్యున్నత ప్రమాణాలతో డిజైన్ చేస్తున్నామని చెప్పారు. పబ్లిక్‌లో ఉన్న అంచనాలకు తగ్గట్టుగా ఫినిషింగ్ ఇవ్వాలంటే కొన్ని విసిష్టమైన గ్రాఫిక్స్ వర్క్ అవసరం అవుతుందనీ, క్వాలిటీ విషయంలో రాజీ పడలేమని ఆయన స్పష్టంగా తెలిపారు. అదే ఈ ఆలస్యానికి కారణమని తెలిపారు.

ఈ ప్రకటనతో ఒక్కసారిగా ప్రేక్షకులలో కొంత నిరాశ నెలకొన్నా, కథనంగా చూస్తే విష్ణు తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదే. పర్ఫెక్ట్ కంటెంట్ తో, ప్రేక్షకులకు మరిచిపోలేని విజువల్ ట్రీట్ అందించాలనే ఉద్దేశంతో విష్ణు టీం పనిచేస్తోంది. మొత్తానికి, కన్నప్ప ఆలస్యం అయిందన్న వార్తతో పాటు ఒక ధృఢమైన నమ్మకాన్ని విష్ణు తన పోస్ట్ ద్వారా ఇస్తున్నాడు. అది ఎంత ఆలస్యమైనా, ఫలితం మాత్రం అద్భుతంగానే ఉంటుందని తెలిపారు. ఇక త్వరలోనే మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.