కన్నప్ప మూవీకి యోగి ఆశీర్వాదం.. రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..
తెలుగు సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కన్నప్ప” సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్ ఎట్టకేలకు అధికారికంగా బయటకు వచ్చింది
By: Tupaki Desk | 9 April 2025 5:36 PM ISTతెలుగు సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కన్నప్ప” సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్ ఎట్టకేలకు అధికారికంగా బయటకు వచ్చింది. అసలైతే ఏప్రిల్ లోనే విడుదల కావాలి. కానీ పలు కారణాల వలన డేట్ మార్చాల్సి వచ్చింది. ఇక ఈ చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను భేటీ అయ్యింది. అలాగే ప్రత్యేకంగా సినిమా పోస్టర్‌ను విడుదల చేయించడంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దర్శకుడు మోహన్ బాబు, హీరో మంచు విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, నిర్మాత వినయ్ మహేశ్వరి తదితరులు యోగి అదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి, సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతి, భక్తి తత్వాన్ని ప్రదర్శించేలా ఈ సినిమా ఉండబోతుందని తెలిసి ఎంతో హర్షించారని సమాచారం.
ఈ సందర్భంలో జూన్ 27న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. విజయవంతమైన హిందూ ఆధ్యాత్మిక చిత్రాల సరసన నిలవబోయే ఈ సినిమా కోసం ఇప్పుడే అంచనాలు ఊపందుకున్నాయి. “కన్నప్ప” సినిమా ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ప్రత్యేకతను చాటుకుంటూనే వచ్చింది. పవిత్రమైన భావజాలం, భారీ తారాగణం, పాన్ ఇండియా ప్రమాణాల్లో తెరకెక్కే ఈ చిత్రంలో మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.
ముఖ్యంగా ప్రభాస్ పాత్ర ఓ హైలైట్‌గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఆధ్యాత్మికతను, యాక్షన్‌ను పర్ఫెక్ట్ గా మిక్స్ చేస్తూ ఈ చిత్రం రూపొందుతోంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్నీ హై స్టాండర్డ్స్‌తో ఉంటాయని సమాచారం.
ఈ సినిమా పోస్టర్‌ను యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విడుదల చేయడం ద్వారా హిందీ రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై బజ్ పెరిగింది. ఉత్తర భారతదేశంలో కూడా ఈ చిత్రానికి మంచి మార్కెట్ ఉండేలా సినిమా టీమ్ వ్యూహాత్మకంగా ప్రమోషన్స్ చేస్తోంది. జూన్ 27న గ్రాండ్ లెవెల్లో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు మరో గర్వకారణంగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. భక్తితో పాటు పవర్ఫుల్ అడ్వెంచర్‌ను చూపించబోతున్న ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని యూనిట్ చెబుతోంది.
