కన్నప్ప.. బ్రేక్ ఈవెన్ అవుతుందా?
టాలీవుడ్ హీరో మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 1 July 2025 7:00 PM ISTటాలీవుడ్ హీరో మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పరమ శివుడి భక్తుడైన కన్నప్ప పురాణగాథ ఆధారంగా రూపొందిన ఆ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. విష్ణు స్వయంగా కథను అందించగా, మోహన్ బాబు భారీ బడ్జెట్ తో మూవీని నిర్మించారు.
సినిమా కోసం భారీ క్యాస్టింగ్ ను రంగంలోకి దించారు మేకర్స్. మోహన్ లాల్, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మండ, రాహుల్ మాధవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా భాగమయ్యారు.
వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో జూన్ 27వ తేదీన రిలీజ్ అయిన కన్నప్ప బడ్జెట్ ఎంతో ఇప్పటివరకు మేకర్స్ రివీల్ చేయలేదు. పలుమార్లు విష్ణు.. బిగ్ నెంబర్ అని చెప్పారు. రీసెంట్ గా తన ఆస్తులన్నీ బ్యాంక్ లో తాకట్టు పెట్టి సినిమా చేశానని అన్నారు. కానీ ఎంతనేది చెప్పలేదు. మొత్తానికి రూ.200 కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మించారని టాక్ వినిపిస్తోంది.
అయితే కన్నప్ప భారీ ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అది ప్రభాస్ వల్లేనని అంతా అంటున్నారు. విష్ణు కూడా అదే చెప్పారు. తొలి రెండు రోజులు కలిపి రూ.40 కోట్లకుపైగా కన్నప్ప రాబట్టినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేశారు. రీసెంట్ గా రూ.50 కోట్ల క్లబ్ లోకి కూడా కన్నప్ప చేరినట్లు తెలిసింది.
ఇప్పుడు వీక్ డేస్ స్టార్ట్ అయ్యాక.. కన్నప్ప వసూళ్లు బాగా తగ్గాయని వార్తలు వస్తున్నాయి. దీంతో సెకెండ్ వీకెండ్ కల్లా థియేట్రికల్ రన్ ముగిసే అవకాశం ఉందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు కన్నప్ప మూవీ.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంటుందో లేదో అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది.
అయితే విష్ణు.. డిజిటల్, శాటిలైట్ ఒప్పందాలను రీసెంట్ గా క్లోజ్ చేశారు. వాటి ద్వారా బడ్జెట్ లో కొంత భాగాన్ని తిరిగి పొందుతారు. కానీ బ్రేక్ ఈవెన్ సాధించడానికి థియేటర్స్ లోనే ఎక్కువ డబ్బు వసూలు చేయాలి. నిజమైన బడ్జెట్ విష్ణుకే తెలుసు కాబట్టి రికవరీ ఆయనకే తెలుస్తుంది. మరి కన్నప్ప బ్రేక్ ఈవెన్ విషయంలో చివరకు ఏమవుతుందో చూడాలి.