ఓవర్సీస్‌లో 'కన్నప్ప' గ్రాండ్ రిలీజ్.. ప్లాన్ ఎలా ఉందంటే..
ఇక ఓవర్సీస్‌లో కన్నప్ప గ్రాండ్ రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్రఖ్యాత డిస్ట్రిబ్యూషన్ సంస్థ వాసరా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను అక్కడ విడుదల చేస్తున్నది.
By: Tupaki Desk | 23 Jun 2025 9:15 AMటాలీవుడ్ హీరో విష్ణు మంచు కలల ప్రాజెక్ట్‌గా రానున్న కన్నప్ప సినిమా ప్రమోషన్స్ తో ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆధ్యాత్మికతతో పాటు విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమాపై గ్రాండ్ హైప్ నెలకొనగా, ఫైనల్‌గా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ మళ్ళీ ఊపందుకుంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డా. ఎం మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో రూపొందించారు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణుకి జోడీగా ప్రీతి ముకుందన్ నటించారు. ఈ భారీ తారాగణం, అద్భుతమైన విజువల్స్, ఆధ్యాత్మిక కథాంశం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
ఇక ఓవర్సీస్‌లో కన్నప్ప గ్రాండ్ రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్రఖ్యాత డిస్ట్రిబ్యూషన్ సంస్థ వాసరా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను అక్కడ విడుదల చేస్తున్నది. జూన్ 26న ఓవర్సీస్‌లో విడుదల కానున్న ఈ సినిమాకి ఇప్పటికే థియేటర్ల జాబితాను విడుదల చేశారు. అంతేకాదు, బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల తొలి షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయన్న టాక్ కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్ ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు.
ఇక ఇండియాలో మాత్రం జూన్ 27న సినిమా విడుదల కానుంది. పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా త్వరలో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమా విజువల్‌గా ఎంతో గ్రాండ్‌గా ఉండబోతోందని ప్రమోషన్ కంటెంట్ తోనే స్పష్టమైంది. వీఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్, క్లాస్ ఎమోషన్స్ అన్నీ కలిపి దర్శకుడు ముకేష్ కుమార్ సింగ్ ఒక ఎపిక్ మూడ్ క్రియేట్ చేశారని తెలుస్తోంది.
మొత్తానికి ఓవర్సీస్‌లో కన్నప్ప మూవీకి మంచి ఓపెనింగ్స్ లభించేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్, భారీ తారాగణం సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకు వచ్చింది. ఇక వాసరా ఎంటర్‌టైన్‌మెంట్ మంచి స్క్రీన్ కౌంట్ కేటాయించడంతో, అక్కడ ఓపెనింగ్ కలెక్షన్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి కన్నప్ప హవా ఏ స్థాయిలో కొనసాగుతుందో.