Begin typing your search above and press return to search.

కన్నప్ప.. విష్ణు కూతుర్ల సాంగ్ ప్రోమో చూశారా?

టాలీవుడ్ హీరో మంచు విష్ణు లీడ్ రోల్ లో నటించిన మూవీ కన్నప్ప. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఆ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

By:  Tupaki Desk   |   27 May 2025 4:45 PM IST
కన్నప్ప.. విష్ణు కూతుర్ల సాంగ్ ప్రోమో చూశారా?
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు లీడ్ రోల్ లో నటించిన మూవీ కన్నప్ప. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఆ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాలో ఆయన కీలక పాత్ర కూడా పోషించారు.


కన్నప్పలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్యామియో రోల్ పోషించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ లాల్ తో పాటు శరత్ కుమార్, మధుబాల, కాజల్ అగర్వాల్ తదితరులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. అదే సమయంలో మోహ‌న్ బాబు మ‌న‌వ‌రాళ్లు, విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా నటిస్తున్నారు.

వారిద్దరూ కన్నప్ప మూవీతోనే తెరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే వారి పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మంచు సిస్టర్స్ పై షూట్ చేసిన.. జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ.. పాట లిరికల్‌ వీడియో ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.సినిమాలో శ్రీకాళహస్తి స్థల పురాణాన్ని వివరించే సాంగ్ అది.

కన్నప్ప హృదయం నుండి వచ్చిన సాంగ్ గా వర్ణించారు మేకర్స్. హర హర మహాదేవ అంటూ నినదించారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఫుల్ సాంగ్ మే 28వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించిన ఆ సాంగ్ ను ఆరియానా, వివియానా పాడటం విశేషం. స్టీఫెన్‌ దేవస్సీ స్వరాలు సమకూర్చారు.

అయితే ప్రోమో ఇప్పుడు శ్రీకాళహస్తి సాంగ్ ప్రోమో అందర్నీ మెప్పిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ అదిరిపోయాయని చెప్పాలి. ఆరియానా, వివియానా కూడా ఆకట్టుకున్నారు. సాంగ్ మ్యూజిక్ అండ్ లిరిక్స్ ఆసక్తిగా ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని పాటల్లో బెస్ట్ గా నిలవనుందని అంటున్నారు.

కాగా, జూన్ 27వ తేదీన కన్నప్ప మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్, పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. అదే సమయంలో మేకర్స్ జోరుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.