Begin typing your search above and press return to search.

వీడియో : అక్కడి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అరాచకం

తాజాగా కర్ణాటకలో కావడి ఫెస్టివల్‌ లో భాగంగా ఎన్టీఆర్‌ అభిమానులు వీపుకు తాళ్లు కట్టుకుని భారీ క్రేన్‌ సహాయంతో గాల్లో వేలాడుతూ ఒక భారీ ఫ్లెక్సీ ని ఎగుర వేశారు.

By:  Tupaki Desk   |   14 Aug 2023 12:01 PM GMT
వీడియో : అక్కడి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అరాచకం
X

టాలీవుడ్ యంగ్ స్టార్‌ ఎన్టీఆర్‌ కి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎన్టీఆర్ కి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా కన్నడం లో ఎన్టీఆర్‌ కి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఇక ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కు మరో సాక్ష్యం అన్నట్లుగా ఈ వీడియో నిలుస్తుంది.

తాజాగా కర్ణాటకలో కావడి ఫెస్టివల్‌ లో భాగంగా ఎన్టీఆర్‌ అభిమానులు వీపుకు తాళ్లు కట్టుకుని భారీ క్రేన్‌ సహాయంతో గాల్లో వేలాడుతూ ఒక భారీ ఫ్లెక్సీ ని ఎగుర వేశారు. ఆ ఫ్లెక్సీలో ఎన్టీఆర్‌ తో పాటు కన్నడ స్టార్‌ నటుడు, దివంగత పునీత్‌ రాజ్ కుమార్‌ ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఈ రేంజ్ లో అక్కడ ప్రదర్శించారు అంటే ఎన్టీఆర్‌ స్టామినా ఏంటో అర్థం అవుతుందని కొందరు అంటున్నారు.

ఎన్టీఆర్ కి కన్నడం లో కూడా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్నది అనేందుకు ఈ వీడియో సాక్ష్యం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్‌ లో ఎన్టీఆర్ కి భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ క్రియేట్‌ అయింది. ఆ ఫాలోయింగ్ నేపథ్యం లో ఫ్యాన్స్ కొందరు ఇలాంటి అరాచకమైన కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నాడు. ఆ స్థాయిలోనే సినిమా ఉండే విధంగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా ను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన హడావుడి ప్రస్తుతం కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ మరో వైపు వార్‌ సీక్వెల్‌ లో నటించబోతున్నాడు.