Begin typing your search above and press return to search.

కన్నడ సినిమా రిలీజ్ ముందు ప్రీమియర్స్..!

ఇప్పుడు డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిచాలని చూస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే హాస్టల్ బాయ్స్ ని తెస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Aug 2023 1:18 PM GMT
కన్నడ సినిమా రిలీజ్ ముందు ప్రీమియర్స్..!
X

యూత్ ఆడియన్స్ ని కనెక్ట్ చేసే సినిమా చేస్తే ఆ సినిమా బడ్జెట్ ఎంత.. అందులో నటించిన క్యాస్టింగ్ ఏంటి అన్నది ఆలోచించకుండానే సినిమా సూపర్ హిట్ చేస్తారు. ఎన్నో సినిమాలు ఇలా యూత్ కి నచ్చే కంటెంట్ తో వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్నాయి. కొన్ని సినిమాలు యూత్ కి నచ్చే అడల్ట్ కంటెంట్ ని టార్గెట్ చేస్తే.. కొన్ని సినిమాలు యూత్ లవ్ స్టోరీస్, ఫ్రెండ్ షిప్ సినిమాలతో హిట్ అందుకున్నాయి. అయితే రీసెంట్ గా కన్నడలో హాస్టల్ లో జరిగిన ఒక మర్డర్ మిస్టరీ కథతో ఒక సినిమా చేశారు. అదే హాస్టల్ హుడుగారు బెకాడిదరె.

నితిన్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రజ్వల్, మంజునాథ నాయక, శ్రీ వాత్స, తేజాస్ జయన్న ప్రధాన పాత్రలుగా నటించారు. కన్నడలో రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

జూలై 21న కన్నడలో రిలీజై యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని అలరించిన హాస్టల్ హుడుగారు బెకాడిదరె సినిమా తెలుగు ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను హాస్టల్ బాయ్స్ అని రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు రిలీజ్ ని చాయ్ బిస్కెట్ చేస్తుంది. ఒక యూట్యూబ్ ఛానెల్ గా మొదలైన చాయ్ బిస్కెట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వరుస హిట్లు కొడుతున్నారు. ఇప్పుడు డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిచాలని చూస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే హాస్టల్ బాయ్స్ ని తెస్తున్నారు. కన్నడ సినిమాను యాజిటీజ్ దించకుండా మన దగ్గర జబర్దస్త్ రష్మి గ్లామర్ ని సినిమాకు యాడ్ చేస్తున్నారు. సినిమాలో రష్మి యూత్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉంది.

ఇక ఈ సినిమాకు కూడా ప్రీమియర్స్ వేసి రిలీజ్ ముందే పాజిటివ్ బజ్ పెంచేలా చేస్తున్నారు మేకర్స్. అందుకే సినిమాను ఆగష్టు 26న రిలీజ్ ఫిక్స్ చేయగా ఒకరోజు ముందే సెలెక్టెడ్ సెంటర్స్ లో హాస్టల్ బాయ్స్ సినిమా ప్రీమియర్స్ చేస్తున్నారు. పెయిడ్ ప్రీమియర్స్ తో సినిమాకు రిలీజ్ ముందే బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

ముఖ్యంగా కంటెంట్ బాగున్న సినిమాలకు ఈ ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే హాస్టల్ బాయ్స్ సినిమాను రిలీజ్ కి ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆల్రెడీ కన్నడలో హిట్ అయ్యింది రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది కాబట్టి హాస్టల్ బాయ్స్ సినిమా తెలుగులో ప్రాఫిట్స్ తెస్తుందని చెప్పొచ్చు.