Begin typing your search above and press return to search.

కన్నడలో కాసుల వర్షం.. తెలుగులో ఏం చేస్తారో?

అయితే, డైరెక్ట్ గా ఇదే సినిమాని తెలుగులోకి డబ్ చేస్తారా లేక, కథ తీసుకొని మన వాళ్లు మళ్లీ రీమేక్ చేస్తారో తెలియాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   7 Aug 2023 11:28 AM GMT
కన్నడలో కాసుల వర్షం.. తెలుగులో ఏం చేస్తారో?
X

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి గతేడాది కేజీఎఫ్, కాంతార వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలతో కన్నడ సినీ ఇండస్ట్రీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే, ఆ రెండింటి తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో చెప్పుకోదగిన సినిమా ఏదీ రాలేదు. దీంతో, కన్నడ సినిమా డీలా పడిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ, ఓ చిన్న సినిమా మళ్లీ ఇండస్ట్రీని గర్వంగా చెప్పుకునేలా చేసింది. అదే హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే.

ఈ హాస్టల్ సినిమా విడదలై చాలా రోజులు అవుతున్నా, అక్కడ ఇంకా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడ బేబీ సినిమా ఎలాగైతే నెమ్మదిగా వచ్చి హిట్ కొట్టింది. అక్కడ ఈ హాస్టల్ మూవీ కూడా అంతే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రక్షిత్‌ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈయనకిది తొలి సినిమా.

క్రైమ్ కామెడీ జోనరల్ లో సినిమా సాగుతుంది. సినిమా మొత్తం ఓ హాస్టల్ చుట్టూ తిరుగుతోంది. రోహిత్ శెట్టి ఓ గెస్ట్ రోల్ లో కనిపించారు. నిజానికి రోహిత్ శెట్టి తప్ప మిగితా అందరూ కొత్తవారే. అయినా, సినిమా హిట్ అయ్యిందంటే, సినిమాలో ఉన్న స్టోరీనే దానికి కారణం.

కాగా, ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కూడా తీసుకురావాలని అనుకుంటున్నారట. అయితే, డైరెక్ట్ గా ఇదే సినిమాని తెలుగులోకి డబ్ చేస్తారా లేక, కథ తీసుకొని మన వాళ్లు మళ్లీ రీమేక్ చేస్తారో తెలియాల్సి ఉంది. ఈ మూవీ ఇక్కడ కూడా మంచి విజయం అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు.

తెలుగులోకి తీసుకురావడం అయితే ఖాయమని తెలుస్తోంది. కానీ, దానిని ఎవరు తీసుకువస్తారు అనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇఖ సినిమా కథ విషయానికి వస్తే, హాస్టల్ రూంలో ఉండే ఐదుగురు స్టూడెంట్స్ కి ఫార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది.

కానీ ఎగ్జామ్స్‌ ఉండటంతో వాళ్ల ఫ్రెండ్స్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఆలోచనను కొన్ని రోజులు పక్కన పెడతారు. కానీ సడెన్ ఓ రోజు వారి హాస్టల్‌ శవమై కనిపిస్తాడు. తన చావుకు వీళ్ళే కారణమంటూ ఆ ఐదుగురు పేర్లు రాస్తాడు. ఆ తర్వాత ఏమైంది? నిజంగానే అతని చావుకు వీరికి సంబంధం ఉందా? ఆ గండం నుంచి ఎలా బయటపడతారు అనేది ఈ మూవీ కథ.

అయితే, మర్డర్ ఉంది అనగానే, సీరియస్ సాగుతుంది అనకుంటే పొరపాటే. ఎందుకంటే, మూవీ చూస్తే కచ్చితంగా కడుపుబ్బా నవ్వేస్తారు. క్రైమ్ కామెడీ జోనర్ ఇది. చాలా తక్కువ బడ్జెట్ తో తీసినా, కాసుల వర్షం కురిపించింది. మరి తెలుగులో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.