వాళ్ల రేంజ్ పెరిగిందండోయ్!
`బాహుబలి`తో టాలీవుడ్ రేంజ్ ఎలా పెరిగిందో? `కేజీఎఫ్` తో శాండిల్ వుడ్ రేంజ్ అలాగే పెరిగింది.
By: Tupaki Desk | 14 July 2025 9:00 PM IST`బాహుబలి`తో టాలీవుడ్ రేంజ్ ఎలా పెరిగిందో? `కేజీఎఫ్` తో శాండిల్ వుడ్ రేంజ్ అలాగే పెరిగింది.`కేజీఎఫ్` రెండు భాగాలు కన్నడ పరిశ్రమను ఒక్కసారిగా పైకి లేపిన సంగతి తెలిసిందే. అప్పటికే రీజనల్ మార్కెట్ కే పరిమితమైన కన్నడ సినిమా `కేజీఎఫ్` నుంచి పాన్ ఇండియాలో వరల్డ్ లోకి అడుగు పెట్టింది. సరిగ్గా అదే వేవ్ లో రిషబ్ శెట్టి తనను తానే పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకున్నాడు. `కాంతార` సినిమాతో ఊహించని సక్సస్ పాన్ ఇండియాలో అందుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం `కాంతారా`కి ప్రీక్వెల్ గా చాప్టర్ 1 తెరకెకకుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు. ఎంతమాత్రం రాజీ పడకుండా ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూమోహన్ దాస్ `టాక్సిక్` చిత్రాన్ని భారీ కాన్వాస్ పై తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఈచిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్- మోన్ స్టార్ మైండ్ క్రియేషన్స్ సంయు క్తంగా 200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నాయి. అలాగే శివరాజ్ కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో `45` అనే చిత్రం తెరకెక్కుతోంది.
అర్జున్ జాన్యా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సురాజ్ ప్రొడక్షన్స్ 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. అలాగే మరో కన్నడ స్టార్ ధృవ సర్జా హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం. `కేడీ ది డెవిల్`. సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేశ్ అరవింద్ లాంటి అగ్ర తారలు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా 150 కోట్లకు పైగానే వ్యయాన్ని కేటాయించారు. కన్నడ పరిశ్రమలో ఇంతకు మునుపెన్నడు ఇంతటి భారీ వ్యయంతో సినిమాలు నిర్మాణం కాలేదు. కేజీఎఫ్ ఇచ్చిన ప్రోత్భలంతోనే అక్కడ నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలకు ఆసక్తి చూపిస్తున్నారు.
స్టోరీ బాగుందంటే? బడ్జెట్ విషయంలో ఆలోచన చేయకుండా నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి. సౌత్ లో కన్నడ పరిశ్రమ చాలా చిన్నది అన్నది నిన్న మొన్నటివరకూ ఉన్న మాట. నేడు అక్కడ నిర్మా ణ సంస్థ, టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాణ సంస్థలకు పోటీగా ఎదుగుతోంది అన్నది కాదనలేని నిజం. ఇంకా ఇతర భాషల హీరోలు కూడా కన్నడలో సినిమాలు చేస్తే బడ్జెట్ ఇంకా పెరుగుతుంది. కొత్త నిర్మాణ సంస్థలు తెరపైకి వస్తాయి. ఆ దిశగాను కన్నడ పరిశ్రమ సన్నాహాలు మొదలు పెడుతోంది.
