Begin typing your search above and press return to search.

ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ కి సీక్వెల్ ప‌క్కా!

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో వికాస్ బ‌హ్ల్ తెర‌కెక్కించిన 'క్వీన్ 'ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Feb 2024 4:30 PM GMT
ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ కి సీక్వెల్ ప‌క్కా!
X

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో వికాస్ బ‌హ్ల్ తెర‌కెక్కించిన 'క్వీన్ 'ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసిందో తెలిసిందే. ప‌దేళ్ల క్రితం 23 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. కంగ‌న కెరీర్ లోనే ఓ గొప్ప చిత్రంగా నిలిచింది. ఆ విజ‌యంతో కంగ‌క ఇంటి పేరు క్వీన్ గా మారిపోయింది. అప్ప‌టివ‌ర‌కూ కంగ‌న అని పిలుచుకునే అభిమానులు నాటి నుంచి క్వీన్ అని ముద్దుగా అభిమానంతో పిలుచుకోవ‌డం మొద‌లు పెట్టారు.

ఆ విజ‌యం కంగ‌క మార్కెట్ ని భారీగా రెట్టింపు చేసింది. దీంతో ఈ సినిమాకి కొన‌సాగింపుగా క్వీన్ -2 కూడా ఉంటుంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం సాగుతుంది. కంగ‌న‌-వికాస్ సైతం ఈ విష‌యాన్ని కొట్టి పారేయ‌కుండా అంతే బ‌జ్ ని తీసుకొచ్చారు. కానీ ఇంత‌వ‌ర‌కూ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ఎక్క‌డా ఇద్ద‌రు స్పందిం చ‌లేదు. తొలిసారి ఓ ఇంట‌ర్వ్యూలో క్వీన్ కి సీక్వెల్ ఉంటుంద‌ని వికాస్ రివీల్ చేసారు.

'ప‌దేళ్ల కింద‌ట సినిమా గురించి ప్రేక్ష‌కులు అడుగుతుంటే ఆ సినిమా నిన్న‌నే రిలీజ్ అయిందా? అనిపి స్తుంది. ఆ సినిమా మాకు అంత‌గా చేరువైంది. క్వీన్ కి కొన‌సాగింపు క‌థ సిద్దంగా ఉంది. కానీ కొంచెం ఆల‌స్య మవుతుంది. కానీ క‌చ్చితంగా ప‌ట్టాలెక్కిస్తాం' అన్నారు. దీంతో 'క్వీన్ -2' కూడా ఉంటుంద‌ని అధికారికంగా వెల్ల‌డైంది. ఆ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని క్వీన్ అభిమానులు కోరుతున్నారు.

పెళ్లి ఆగిపోయిన త‌ర్వాత ఒత్తిడికి గురైన పంజాబీ రాణీ మెహ‌రా వ‌దులుకున్న స్వేచ్చ‌ని..ఆనందాన్ని తిరిగి పొందేందుకు విదేశాల‌కు ప‌య‌నం అవుతుంది. ఆమె ఒంట‌రిగా జీవితాన్ని ఎలా గడుపుతుంది అనేది క్వీన్ క‌థ‌గా చెప్పారు. ఇప్పుడీ క‌థ‌కి కొనసాగింపు క‌థ‌ని రెడీగా రాసి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కంగ‌న ర‌నౌత్ 'ఎమ‌ర్జెన్సీ'.. అలాగే వికాస్ తెర‌కెక్కించిన 'షైతాన్' చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.