Begin typing your search above and press return to search.

డ‌బ్బు తీసుకుని... పెళ్లిలో డ్యాన్సుల‌పై కంగ‌న పంచ్!

తాజాగా అంబానీల ప్రీవెడ్డింగ్ ఈవెంట్లో హిందీ తార‌ల డ్యాన్సింగుల గురించి కంగ‌న చేసిన వ్యాఖ్య దుమారంగా మారింది.

By:  Tupaki Desk   |   7 March 2024 5:07 AM GMT
డ‌బ్బు తీసుకుని... పెళ్లిలో డ్యాన్సుల‌పై కంగ‌న పంచ్!
X

ధ‌నికుల పెళ్లిళ్ల‌లో డ్యాన్సులు చేయ‌డం.. దానికోసం తార‌లు డబ్బు అందుకోవ‌డం రెగ్యుల‌ర్‌గా జ‌రిగేదే. స‌ల్మాన్, హృతిక్, అమీర్, షారూఖ్ ఇలా అగ్ర న‌టులంతా కెరీర్ తొలి నాళ్ల‌లో సెల‌బ్రిటీ వెడ్డింగ్స్ లో డ్యాన్సులు చేసి దానికి ప్యాకేజీలు అందుకునేవారు.

అయితే ఇలాంటి వాటికి పూర్తి వ్య‌తిరేకంగా ఉండే తార‌లు ఉన్నారు. అలాంటి వారిలో క్వీన్ కంగ‌న కూడా ఒక‌రు. తాజాగా అంబానీల ప్రీవెడ్డింగ్ ఈవెంట్లో హిందీ తార‌ల డ్యాన్సింగుల గురించి కంగ‌న చేసిన వ్యాఖ్య దుమారంగా మారింది. అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో బాలీవుడ్ తారలు డ్యాన్స్ చేయడంపై కంగనా రనౌత్ పరోక్షంగా విరుచుకుపడింది అంటూ ప్ర‌చారం సాగుతోంది.

మార్చి 1 నుంచి 3 వ‌ర‌కూ గుజ‌రాత్ జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ ఉత్సవాల్లో పలువురు బాలీవుడ్ A-లిస్టర్‌లు డ్యాన్స్ ఫ్లోర్ పై విరుచుకుప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ముగ్గురు ఖాన్‌లు..రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, దిల్జిత్ దోసాంజ్, కరీనా కపూర్ ఖాన్ ఇలా ప్రతి ఒక్కరూ డ్యాన్సుల‌తో అల‌రించారు. అయితే హిందీ తార‌లు ఇలా డ్యాన్స్ చేసినందుకు కంగనా రనౌత్ ప‌రోక్షంగా సెటైర్ వేసార‌ని గుస‌గుస వినిపిస్తోంది.

కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వార్తా కథనం స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయ‌గా, అందులో లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తాను పెళ్లిలో ఎప్పుడూ పాడనని పేర్కొన్నట్టు తెలిపారు. ``మీరు నాకు ఐదు మిలియన్ డాలర్లు ఇచ్చినా నేను రాను.. లతా మంగేష్కర్ పెళ్లిలో పాడటానికి నిరాకరించారు`` అని ఆ వార్తా కథనానికి శీర్షిక ఉంది. తన కెరీర్‌లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ అనేక హిట్ పాటలు త‌న‌తో ఉన్నప్పటికీ ఆత్మ‌ గౌరవం అనుమతించకపోవడంతో వివాహాలలో ప్రదర్శన ఇవ్వడానికి ఎప్పుడూ అంగీకరించలేదని కంగ‌న‌ పేర్కొంది.

నేను ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను.. కానీ లతా జీ - నేను భారీ హిట్ పాటలను కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రమే (ఫ్యాషన్ కా జల్వా, ఘనీ బావ్లీ హో గయీ, లండన్ తుమ్‌క్డా, సాదీ గల్లీ, విజయ్.. భావ మొదలైనవి). అయితే ఎన్ని ప్రలోభాలకు లోనైనా నేను పెళ్లిళ్లలో ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు.. చాలా సూపర్ హిట్ ఐటెం సాంగ్స్ కూడా నాకు ఆఫర్ చేసారు. కానీ చేయ‌లేదు. త‌దుప‌రి నేను అవార్డు షోలను కూడా తప్పించాను. డ‌బ్బుకు నో చెప్పడానికి బలమైన వ్య‌క్తిత్వం ఆత్మ‌గౌరవం అవసరం. షార్ట్ కట్‌ల ప్రపంచంలో యువతరం వారు సంపాదించగల సంపద మాత్రమే సమగ్రత (థంబ్స్ అప్ ఎమోజి)`` అని కంగ‌న‌ రాసారు.

అంబానీల ప్రీవెడ్డింగును అపహాస్యం చేస్తూ కంగ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... కంగనా తాను దర్శకత్వం వ‌హించిన చిత్రం `ఎమర్జెన్సీ`ని విడుద‌ల చేసేందుకు ఆస‌క్తిగా ఉంది. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది.