Begin typing your search above and press return to search.

నియోజ‌క వ‌ర్గంలో అడ్డంగా దొరికిపోయిన న‌టి!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ నిప్పులు చెరిగితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   8 April 2024 8:08 AM GMT
నియోజ‌క వ‌ర్గంలో అడ్డంగా దొరికిపోయిన న‌టి!
X

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ నిప్పులు చెరిగితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అదీ సోష‌ల్ కాజ్ ని ఎంచుకుని కంగ‌న బ‌రిలోకి దిగిందంటే స‌న్నివేశం బాల‌య్య సినిమా సీన్ల‌నే త‌ల‌పిస్తుంది. కంగ‌న‌కి ప్ర‌త్య‌ర్ధి ఎలాంటి వారైనా డోంట్ కేర్ అంటూ ముందుకు దూసుకుపోయే నైజం. ఆమెలోని తెగింపు...పౌరుషం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌లే బీజీపీ పార్టీ నుంచి కూడా కంగ‌న లోక్ స‌భ‌కు పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం అమ్మ‌డు మాండీ నియోజ‌క‌వ‌ర్గాన్ని క్యాపెనింగ్ తో చుట్టేస్తుంది. గెలుపు ల‌క్ష్యంగా అక్క‌డ ప‌నిచేస్తోంది ఇప్పుడు. తాను గెలిచి జ‌నాల్లో త‌నెంత బ‌ల‌వంతురాలో నిరూపించుకునే పనిలో ఉంది. ఎంపీగా గెలిచి స‌త్తా చాటుతాన‌ని అదిష్టాన‌ని ప్రామిస్ చేసి వ‌చ్చింది. అందుకు త‌గ్గ‌ట్టే నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతుంది. అయితే గొడ్డు మాంసం ఎఫెక్ట్ కంగ‌న‌పై ఇలా రివ‌ర్స్ అవుతుంద‌ని మాత్రం అమ్మ‌డు ఊహించి ఉండ‌దు.

ప్ర‌స్తుతం కంగ‌న‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు మామూలుగా పేల‌డం లేదు. గ‌తంలో అమె గొడ్డు మాంసం(బీప్ ) పైచేసిన వీడియోలే ఇలా ఇర‌కాటంలో ప‌డేసాయి. ఇటీవ‌ల ఓసంద‌ర్భంలో తాను గొడ్డుమాంసం తిన‌నని ట్వీట్ చేసింది. అయితే 2019 మే 19న ఇందుకు భిన్నంగా మ‌రో ట్వీట్ చేసింది. గొడ్డుమాంసం తిన‌డం త‌ప్పుకాద‌ని... దానికి మ‌తంతో సంబంధం లేద‌ని ట్వీట్ చేసింది. ఇప్పుడీ రెండు వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అప్పుడ‌లా..ఇప్పుడిలా ఏంటి కంగ‌న ఈ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ అంటూ ఆడేసుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఒక పాత్ర నుంచి మ‌రో పాత్ర‌కి మారిన‌ట్లు...రాజకీయాల్లోకి వెళ్లాక అప్పుడే మాటలు మార్చ‌డం నేర్చుకున్నావా? అంటూ నెటి జ‌నులు..వ్య‌తిరేక వ‌ర్గం నిప్పుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. అయినా రాజ‌కీయాలంటే ఇవ‌న్నీ ఇండియాలో స‌హ‌జ‌మే. ఎంత‌టి వారైనా మాట‌లు మార్చాల్సిందే..వాటితో పాటు రూపాలు మార్చాల్సిందేన‌ని ప్ర‌త్యేకంగా చెప్పాలా.