Begin typing your search above and press return to search.

పెళ్లి పీటలు ఎక్కనున్న కంగనా?

అందుకే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా అందరూ కంగనా రనౌత్ ని చూస్తారు. ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకి రాబోతోంది

By:  Tupaki Desk   |   28 Sep 2023 5:09 AM GMT
పెళ్లి పీటలు ఎక్కనున్న కంగనా?
X

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. 2006లో బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ గ మారింది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో బాలీవుడ్ స్టార్స్ కి పోటీ ఇచ్చే రేంజ్ కి ఎదిగింది. బాలీవుడ్ ని రూల్ చేస్తున్న కుటుంబాలతో గొడవపడి కూడా ఆమె తన బ్రాండ్ ఇమేజ్ ని అలాగే కొనసాగిస్తోంది.

అందుకే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా అందరూ కంగనా రనౌత్ ని చూస్తారు. ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన కంగనా మరల బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది. చంద్రముఖి 2కి ముందు కంగనా రనౌత్ నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు.

మణికర్ణిక తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా పడలేదు. ఇదిలా ఉంటే హీరోయిన్ గా సుదీర్ఘ కాలం కెరియర్ కొనసాగించిన ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్తని ఆమె పెళ్లాడబోతోందని బిటౌన్ లో వినిపిస్తోన్న టాక్. ఈ ఏడాది డిసెంబర్ లో కంగనా రనౌత్ ఎంగేజ్మెంట్ జరగనుందని టాక్ నడుస్తోంది.

అలాగే వచ్చే ఏడాదిలో పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితం స్టార్ట్ చేయనుంది అంటూ గట్టిగా వినిపిస్తోంది. దీనిపై కంగనా రనౌత్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఖండన రాలేదు. దీంతో నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి. కంగనా రనౌత్ త్వరలో ఎమర్జెన్సీ అనే సినిమాతో దర్షకురాలిగా కూడా తన అదృష్టం పరీక్షించుకోబోతోంది. ఇప్పటికే మణికర్ణిక సినిమాతో దర్శకుడిరాలిగా ఆమె ఎంట్రీ ఇచ్చింది.

ఇందిరాగాంధీ పాత్రలో ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఆమె సొంతం ప్రొడక్షన్ లోనే ఈ మూవీ నిర్మాణం జరుగుతోంది. దానిపై చాలా కాన్ఫిడెంట్ గా కంగనా రనౌత్ ఉంది. చంద్రముఖి 2 తర్వాత సౌత్ లో కూడా తనకు మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతోందని భావిస్తోంది.