Begin typing your search above and press return to search.

ల‌వ్ ఫెయిలైతే అన్నీ లాభాలే అంటోన్న హీరోయిన్!

కంగ‌న న‌టించిన 'తేజ‌స్' సినిమా ప్ర‌మోష‌న‌ల్ భాగంగా అమ్మ‌డు ఈ వ్యాఖ్య‌లు చేసింది. 'ఎలాంటి సంబంధాలు అయినా ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ప్రేమ‌లో అంద‌రూ విజ‌యం సాధించ‌లేరు

By:  Tupaki Desk   |   29 Oct 2023 1:30 AM GMT
ల‌వ్ ఫెయిలైతే అన్నీ లాభాలే అంటోన్న హీరోయిన్!
X

సెల‌బ్రిటీల ప్రేమ వివావాహాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు 80 శాతం ప్రేమ వివాహాలే క‌నిపిస్తాయి. పెళ్లి త‌ర్వాత ప్ర‌యాణాలు ఎలా ఉంటాయి? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి ప్రేమ‌..పెళ్లి మాత్రం చాలా వేగంగా జ‌రిగిపోతుంది. తాజాగా బాలీవుడ్ క్వీన్ ప్రేమ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ల‌వ్ లో ఫెయిల‌వ్వ‌డం త‌న జీవితానికి ఎంతో మంచి జ‌రిగింద‌ని అంటోంది.

కంగ‌న న‌టించిన 'తేజ‌స్' సినిమా ప్ర‌మోష‌న‌ల్ భాగంగా అమ్మ‌డు ఈ వ్యాఖ్య‌లు చేసింది. 'ఎలాంటి సంబంధాలు అయినా ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ప్రేమ‌లో అంద‌రూ విజ‌యం సాధించ‌లేరు. నేను కూడా తెలిసి తెలియ‌ని వ‌య‌సులో ప్రేమ‌లో ప‌డ్డాను. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల విడిపోయాం. అలా ఎందుకు విడిపోయామ‌ని చాలా బాధ‌ప‌డ్డాను కొన్నాళ్ల పాటు. కానీ త‌ర్వాత అర్ద‌మైంది విడిపోయి మంచి ప‌ని చేసాన‌ని. ప్రేమ‌లో కొన‌సాగితే అవే ఆలోచ‌న‌ల‌తో అక్క‌డే ఉండిపోయేదాన్ని.

ప్రేమ‌లో ఉంటే స‌మ‌యం అందుకే స‌రిపోతుంది. మ‌రో ఆలోచ‌న లేకుండా చేస్తుంది. ల‌క్కీగా ఆ మ‌త్తు నుంచి బ‌య‌ట ప‌డ్డాను. ఫెయిల్యూర్ వ‌ల్ల లాభాలంటే అందులో ఫెయిలైన వారికే తెలుస్తుంది. ఇది కేవ‌లం ప్రేమ గురించి మాత్ర‌మే. అలా అన్నాన‌ని పెళ్లి చేసుకోన‌ని కాదు. అంద‌రిలాగా నాకు పెళ్లి చేసుకుని ఓ కుటుంబం ఏర్ప‌రుచుకోవాల‌ని ఉంది. కుటుంబానికి నేను ఎంతో గౌర‌వాన్ని ఇస్తాను.

ఐదేళ్ల‌లో పెళ్లి చేసుకుంటా. అయితే అది పెద్ద‌ల కుదిర్చిన పెళ్లి అవ్వాలి. పెళ్లి కోడుకుని వాళ్లే వెత‌కాలి. పెద్ద‌ల చూసిన అబ్బాయిన ప్రేమించి పెళ్లి చేసుకుంటా. పెళ్లి పెద్ద‌ల స‌మ‌క్షంలో జ‌ర‌గాల‌నుకుంటున్నా' అని అంది. మ‌రి ప్రేమ వైఫ‌ల్యం విష‌యంలో కంగ‌న వ్యాఖ్య‌ల‌తో ఎంత మంది ఏకీ భ‌విస్తారో చూడాలి. సాధార‌ణంగా ప్రేమ లో ఫెయిలైన వారు మ‌ళ్లీ ప్రేమించాలంటే ఆలోచిస్తారు. ఒక‌సారి చితికిన మ‌నసు మ‌రొక‌రితో మ‌ళ్లీ అతికించాలంటే అంత సుల‌భంగా జ‌రిగే ప‌ని కాద‌ని అంటారు. కంగ‌న కూడా ప్రేమ విష‌యంలో అలాగే ఫీల‌వుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.