Begin typing your search above and press return to search.

2024కి స‌రిప‌డే మంచి మాట చెప్పిన క్వీన్

2023 క్వీన్ కంగ‌న‌కు ఏమాత్రం క‌లిసి రాలేదు. తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌ల‌చిన చందంగా ఈ ఏడాది వ‌రుస ప‌రాజ‌యాలు కంగ‌న‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.

By:  Tupaki Desk   |   1 Jan 2024 3:43 AM GMT
2024కి స‌రిప‌డే మంచి మాట చెప్పిన క్వీన్
X

2023 క్వీన్ కంగ‌న‌కు ఏమాత్రం క‌లిసి రాలేదు. తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌ల‌చిన చందంగా ఈ ఏడాది వ‌రుస ప‌రాజ‌యాలు కంగ‌న‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. దీనికి అద‌నంగా రాజ‌కీయ నాయ‌కుల‌తో త‌గాదాలు, ఇండ‌స్ట్రీ ముఖ్యుల‌తో గొడ‌వ‌లు వ‌గైరా నెగెటివిటీని పెంచి పోషించాయి. ఏది ఏమైనా 2024లో త‌న కెరీర్ ని తిరిగి పున‌రుద్ధ‌రించేందుకు తీవ్రంగా త‌పిస్తోంది. అప్పులు చేసి తీసిన ఎమ‌ర్జెన్సీతో కొత్త సంవ‌త్స‌రంలో అయినా త‌న క‌ల సాకార‌మ‌వుతుంద‌ని కూడా కంగ‌న ఆశిస్తోంది.

ఇంత‌లోనే క్వీన్ 2023ను త‌ల‌చి భ‌విష్య‌త్ క‌ల‌ల గురించి మాట్లాడింది. ''ఎవరికైనా స్పేస్ లేదని భావిస్తే, ...మీరు ఇంటికి వెళ్తున్నారని గుర్తుంచుకోండి`` అని చెప్పింది. 2006లో గ్యాంగ్‌స్టర్ తో సినీఆరంగేట్రం చేసిన కంగ‌న ఫ్యాషన్ -లైఫ్..ఇన్ ఎ మెట్రో-తను వెడ్స్ మను-క్రిష్ 3 స‌హా ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించింది. 2014 కామెడీ డ్రామా `క్వీన్‌`లో టిఫిక‌ల్ వధువు పాత్ర పోషించింది. 'త‌ను వెడ్స్ మను రిటర్న్స్`లో ద్విపాత్రాభినయం చేసింది. ఈ రెండు చిత్రాల్లో న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉత్త‌మ న‌టిగా వరుసగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. 2020లో సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్‌ని ప్రారంభించింది.

గ‌డిచిన ఏడాది అనుభ‌వాల‌పై క్వీన్ ఒక నోట్‌ను రాసింది. ''నేను ఒక స్థాయిలో లేను అనే అంతర్లీన భావనతో పెరిగాను. నేను నా కలలు, పొలాలు, కుటీరాలు వీటితో సంతోషంగా ఉన్నాను. నేను సంతృప్తిగా ఉన్నాను.. ప్రశాంతంగా ఉన్నాను.. కానీ నేను ఎప్పుడూ ఇంట్లో ఉండలేకపోయాను. మనం ఈ శరీరంలో స్థిరపడకూడదని, ఇది నశ్వరమైన దశ అని మనం గుర్తించాలి. ఇంట్లో ఉండేందుకు ఎప్పుడూ ప్రయత్నించకూడదని మెల్లగా అర్థమైంది. నేను ఇంట్లో ఉన్నానని అంగీకరించినప్పటి నుండి... ఇది 2023లో నా అభ్యాసం. మీరు ఎక్కడికీ చేరుకోలేర‌ని భావిస్తే .. మీరు మీ ఇంటికి వెళ్తున్నారని గుర్తుంచుకోండి`` అని క‌వితాత్మ‌కంగా నోట్ లో రాసింది క్వీన్.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కంగనా చివరిసారిగా తమిళ చిత్రం `చంద్రముఖి 2`లో టైటిల్ పాత్ర‌ను పోషించింది. యాక్షన్ థ్రిల్లర్ `తేజస్`లో తేజస్ గిల్ పాత్రను పోషించింది. కొత్త సంవ‌త్స‌రంలో విడుద‌ల‌కు రానున్న `ఎమర్జెన్సీ`లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా కోసం త‌న ఆస్తుల‌ను త‌ణ‌కా పెట్టి మ‌రీ అప్పులు తెచ్చాన‌ని కంగ‌న తెలిపింది.