Begin typing your search above and press return to search.

ఈ నాల్గవ చంద్రముఖి మెప్పించేనా?

సౌత్ సినీ ప్రేక్షకులకు చంద్రముఖి ఒక బెంచ్ మార్క్ హర్రర్ సినిమా అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   24 Sept 2023 10:00 PM IST
ఈ నాల్గవ చంద్రముఖి మెప్పించేనా?
X

సౌత్ సినీ ప్రేక్షకులకు చంద్రముఖి ఒక బెంచ్ మార్క్ హర్రర్ సినిమా అనడంలో సందేహం లేదు. మొదట మలయాళంలో ఆ తర్వాత కన్నడం లో తర్వాత తమిళంలో ప్రేక్షకులను అలరించిన చంద్రముఖి ఇప్పుడు మళ్ళీ రాబోతుంది.

మలయాళంలో శోభన చంద్రముఖి గా మొదటి సారి నటించిన మెప్పించింది. ఆ తర్వాత కన్నడలో అదే పాత్రను దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య పోషించి మెప్పించారు. శోభన, సౌందర్య పోషించిన పాత్రను తమిళ్ లో జ్యోతిక తో చేయించడం తో అప్పట్లో చాలా మంది విమర్శించారు.

ఆ ఇద్దరి స్థాయి నటనను జ్యోతిక కనబరిచే అవకాశం ఉందా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసి... శోభన మరియు సౌందర్యలకు ఏ మాత్రం తగ్గకుండా చంద్రముఖి పాత్రకు అద్భుతమైన నటన ప్రతిభ కనబరిచి జ్యోతిక న్యాయం చేసింది.

ఇప్పుడు చంద్రముఖి రెండవ పార్ట్ రాబోతుంది. లారెన్స్ హీరోగా వాసు దర్శకత్వంలో రూపొందిన చంద్రముఖి 2 సినిమా లో చంద్రముఖి పాత్రను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ పోషించడం విశేషం. నటన పరంగా కంగనాకి ఎలాంటి వంక పెట్టనవసరం లేదు.

ఆమె నటనలో ది బెస్ట్ అని చాలా సార్లు నిరూపితమైంది. ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అయితే చంద్రముఖి పాత్రను ఆమె ఎంత వరకు రక్తి కట్టించగలదు అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పటి వరకు శోభన, సౌందర్య, జ్యోతిక ముగ్గురు కూడా చంద్రముఖి పాత్రలో నటించినా.. వారు కాకుండా ప్రేక్షకులకు చంద్రముఖిని చూపించారు.

కనుక చంద్రముఖి 2 సినిమాలో కూడా కంగనా కాకుండా చంద్రముఖి కనిపిస్తే కచ్చితంగా సినిమాకు మంచి విజయం దక్కడం ఖాయం. మొత్తానికి చంద్రముఖి 2 సినిమా కంగనా మరోసారి సౌత్ లో ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది ఏమో చూడాలి.