Begin typing your search above and press return to search.

సెలూన్ వెలుప‌ల మిస్ట‌రీ మ్యాన్‌తో కంగ‌న‌

నిప్పు లేనిదే పొగ రాద‌ని అంటారు! కానీ నిప్పు లేకుండానే పొగ పెట్ట‌డం బాలీవుడ్ మీడియా విధానం

By:  Tupaki Desk   |   14 Jan 2024 2:45 AM GMT
సెలూన్ వెలుప‌ల మిస్ట‌రీ మ్యాన్‌తో కంగ‌న‌
X

నిప్పు లేనిదే పొగ రాద‌ని అంటారు! కానీ నిప్పు లేకుండానే పొగ పెట్ట‌డం బాలీవుడ్ మీడియా విధానం. ఇప్పుడు అలాంటి వార్త ఒక‌టి క్వీన్ కంగ‌న‌ను చాలా చికాకు పెట్టింది. శుక్రవారం కంగనా రనౌత్ ముంబైలోని సెలూన్ వెలుపల ఒక మిస్టరీ మ్యాన్‌తో చేతులు క‌లిపి కనిపించింది. క్ష‌ణమైనా ఆల‌స్యం కాకుండా ఇది మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చేసింది. కంగ‌న‌ డేటింగ్ లో ఉందంటూ పుకార్లు వైర‌ల్ అయ్యాయి. కంగ‌న ప్రింటెడ్ బ్లూ మ్యాక్సీ దుస్తులు ధరించి సెలూన్ నుండి బయటకు వస్తూ అత‌డి చేతులు పట్టుకుని క‌నిపించింది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు ఆ వ్యక్తి ఎవ‌రు? అంటూ ఆశ్చర్యపోతున్నారు.


ఇప్పుడు కంగనా తన ఇన్‌స్టాలో దీనిపై స్పందించింది. అత‌డు ఎవ‌రో కాదు.. తన హెయిర్‌స్టైలిస్ట్.. తన బాయ్‌ఫ్రెండ్ కాదని చెప్పింది. నేను సెలూన్ వెలుపల తరచుగా క‌లుసుకునే మిస్టరీ మ్యాన్ గురించి నాకు చాలా కాల్‌లు ఎస్‌ఎంఎస్ లు వస్తున్నాయి. మొత్తం ఫిల్మీ/బోలీ మీడియాకు లాలాజలం కారుతోంది. అన్ని రకాల శృంగార కల్పనలతో మీడియా ముందుకు వస్తోంది. ఒక స్త్రీ - పురుషుడు కలిసి వీధిలో నడవడం లైంగికంగా మాత్రమే కాదు.. వారు సహోద్యోగులు, తోబుట్టువులు, ఉద్యోగ స్నేహితులు..కొన్నిసార్లు చాలా ఇత‌ర విష‌యాలు కావచ్చు. చాలా సంవత్సరాల స్నేహపూర్వక క్లయింట్‌తో అద్భుతమైన మర్యాదగల హెయిర్‌స్టైలిస్ట్ అతడు`` అని క్లాస్ తీస్కుంది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే 2023 కంగ‌న‌కు కెరీర్ ప‌రంగా బిజీయెస్ట్ ఇయర్. ఇది త‌న‌కు పీడ‌క‌ల‌ను మిగిల్చిన సంవ‌త్స‌రం కూడా. కొన్ని వ‌రుస చిత్రాల్లో న‌టించిన కంగ‌న‌కు ఏడాదంతా చేదు అనుభ‌వాలే మిగిలాయి. కంగనా చివరిగా తేజస్‌లో కనిపించింది. 27 అక్టోబర్ 2023న థియేటర్‌లలో విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ గా మిగిలింది. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వ‌ర‌స చిత్రాలు ఘోర‌ప‌రాజ‌యం పాల‌వ్వ‌డం కంగ‌న‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

క్వీన్ కంగ‌న న‌టిస్తూ నిర్మించిన‌ ఎమర్జెన్సీపైనే ఆశ‌లు. ఈ చిత్రంతో దర్శకురాలిగాను అరంగేట్రం చేస్తోంది. ఇందులో కంగ‌న దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ త‌దితరులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు. అలాగే పాన్-ఇండియా సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం కోసం ఆర్ మాధవన్‌తో మళ్లీ క్వీన్ జత క‌లుస్తోంది.