Begin typing your search above and press return to search.

బాలీవుడ్ క్వీన్ పాలిటిక్స్.. మొదలైనట్లేనా..

కాని సినిమాల పరంగా మాత్రం వరుసగా ఫెయిల్యూర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 12 వరుస ఫ్లాప్ లని ఆమె తన ఖాతాలో వేసుకుంది

By:  Tupaki Desk   |   27 Dec 2023 3:56 AM GMT
బాలీవుడ్ క్వీన్ పాలిటిక్స్.. మొదలైనట్లేనా..
X

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ కంగనా రనౌత్. స్టార్ హీరోయిన్ గా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ గత కొన్నేళ్ళ నుంచి సక్సెస్ లేక సతమతం అవుతున్నారు. బాలీవుడ్ నెపోటిజం గురించి ఆమె వాయిస్ రైజ్ చేసిన తర్వాత నుంచి కంగనా రనౌత్ కి సోషల్ మీడియాలో, అలాగే రాజకీయంగా భాగా పలుకుబడి పెరిగింది.

కాని సినిమాల పరంగా మాత్రం వరుసగా ఫెయిల్యూర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 12 వరుస ఫ్లాప్ లని ఆమె తన ఖాతాలో వేసుకుంది. మణికర్ణిక తర్వాత ఇప్పటి వరకు చేసిన ఏ ఒక్క సినిమా కూడా కంగనాకి సక్సెస్ ఇవ్వలేదు. తమిళంలో జయలలిత బయోపిక్ గాని, చంద్రముఖి 2 కాని ఆమెకి విజయాల్ని అందించలేదు.

ప్రస్తుతం తేజాస్ అనే మూవీతో పాటు ఎమర్జన్సీ మూవీ కూడా కంగనా రనౌత్ చేస్తున్నారు. ఎమర్జన్సీ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. ఇదిలా ఉంటే చాలా కాలంగా ఆమె బీజేపీ పార్టీకి, మోడీకి విదేయురాలిగా ఉన్నారు. హిందుత్వ అజెండాతో సోషల్ మీడియాలో రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు.

ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇండియన్ ట్రెడిషనల్ చీర కట్టులోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో త్వరలో ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తారనే ప్రచారం నడుస్తోంది. కంగనా రనౌత్ సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి రానున్న లోక్ సభ ఎన్నికలలో ఎంపీగా బరిలో నిలబడే ఆలోచనలో కంగనా రనౌత్ ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే బీజేపీ పెద్దల నుంచి కంగనాకి దీనిపై సమాచారం అందిందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో అధికారికంగా బీజేపీ తీర్ధం పుచ్చుకోనుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో ఎంతటి వారికైనా సమాధానం చెప్పే కంగనా లాంటి డేరింగ్ విమెన్ రాజకీయాలలో ఉంటే ఇంకా బలంగా తన వాయిస్ వినిపించగలదని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.