Begin typing your search above and press return to search.

పాత్ర‌పై పిచ్చి ప్రేమ‌తో తొంద‌ర‌ప‌డిన హీరోయిన్!

ముఖ్యంగా చంద్ర‌ముఖి పాత్ర పోషించిన కంగ‌నా నెట్టింట ఏ రేంజ్ లో ట్రోలింగ్ గురైందో తెలిసిందే. నిజానికి ఆ ట్రోలిగ్ స‌మంజ‌సం కాదు అన‌డానికి ఛాన్స్ లేదు

By:  Tupaki Desk   |   20 Nov 2023 5:30 PM GMT
పాత్ర‌పై పిచ్చి ప్రేమ‌తో తొంద‌ర‌ప‌డిన హీరోయిన్!
X

చాలా మంది హీరోయిన్ల‌కు డ్రీమ్ రోల్స్ అంటూ కొన్ని ఉంటాయి. తెర‌పై ప్రిన్సెస్ లా క‌లినిపించాల‌ని.. స‌వాళ్ల తో కూడిన రోల్స్ చేయాల‌ని..యాక్ష‌న్ పాత్ర‌ల్లో హీరోల‌కు మేమేం త‌క్కువ కాద‌ని నిరూపించు కోవాల‌ని చాలా మంది హీరోయిన్లు ఆశ‌ప‌డుతుంటారు. కానీ ఆ పాత్ర‌లు అంద‌రికీ ద‌క్క‌వు. వాటి ఎంపిక వెనుక ఎన్నో అంశాలు కీల‌క పాత్ర పోషిస్తుంటాయి. ఆ విష‌యంలో ల‌క్ కూడా క‌లిసి రావాలి. లేదంటే? హీరోయిన్ గా బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగానే స‌త్తా చాటే స్టామినా ఉండాలి.

అప్పుడే అలాంటి పాత్ర‌లు మేక‌ర్స్ సృష్టించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. కానీ పాత్ర‌ల‌పై పిచ్చి ప్రేమ‌తో క‌మిట్ అయితే ఎలా ఉంటుందో? ఎలాంటి విమర్శ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందో? అన‌డానికి కంగ‌నా ర‌నౌత్ లాంటి వాళ్ల‌ను ఉదాహ‌ర‌ణగా తీసుకొవ‌చ్చు. ఆమె న‌టించిన 'చంద్ర‌ముఖి-2' బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితం సాధించిందో తెలిసిందే. చంద్ర‌ముఖి సినిమానే మ‌ళ్లీ ఉన్న‌ది ఉన్న‌ట్లు తీసి దానికి 'చంద్ర‌ముఖి -2' సీక్వెల్ ని మార్కె ట్ లోకి తెచ్చి అబాసు పాలు అయ్యారు.

ముఖ్యంగా చంద్ర‌ముఖి పాత్ర పోషించిన కంగ‌నా నెట్టింట ఏ రేంజ్ లో ట్రోలింగ్ గురైందో తెలిసిందే. నిజానికి ఆ ట్రోలిగ్ స‌మంజ‌సం కాదు అన‌డానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చంద్ర‌ముఖిలో జ్యోతిక పోషించిన పాత్ర‌నే మ‌ళ్లీ కంగ‌న పోషించింది. అందులో కొత్త‌ద‌నం ఏముందో? వాళ్ల‌కే తెలియాలి. ఈ పాత్ర‌లో కంగ‌న ప‌ట్టుబ‌ట్టి న‌టించింది? అన్న విష‌యం ఎంత మంది తెలుసు.

పి. వాసు సీక్వెల్ ప్ర‌క‌టించ‌గానే స్వ‌యంగా కంగ‌న స‌ద‌రు ద‌ర్శ‌కుడికి ఫోన్ చేసి చంద్ర‌ముఖి పాత్ర నేను పోషిస్తాను అని చెప్పింది. కేవ‌లం ఆ పాత్ర‌మై ఉన్న పిచ్చి ప్రేమ‌తోనే కంగ‌న అలా చేసింది. ఆ మ‌త్తులో ఆ పాత్ర ఎలా ఉంది? అన్న విష‌యాన్ని కూడా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌లేదు. కంగ‌న అస‌లు చంద్ర ముఖి సినిమా చూసి ఆ పాత్ర‌కి ఒప్పుకుందా? లేకుండా? కొత్త‌గా ఉందని ఓ రాయి వేద్దామ‌ని వేసిందా? అన్న‌ది తెలియ‌దుగానీ పాత్ర‌ల‌పై పిచ్చి ప్రేమ అప్పుడ‌ప్పుడు ఇలాంటి త‌ప్పులు చేయిస్తంది అన్న విష‌యం మాత్రం అర్ద‌మ‌వుతుంది. బాలీవుడ్ లో ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌లు...శ‌క్తివంత‌మైన రోల్స్ లో మెప్పించిన కంగ‌న చంద్ర‌ముఖి పాత్ర‌కు ఎలా ఒప్పుకుంది? అన్న సందేహం రాక‌మాన‌దు.