Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ రాయబారి తో ఆ హీరోయిన్ మంత‌నాలు!

బాలీవుడ్ డ్యాష్ అండ్ డేరింగ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ప్ర‌క‌ట‌న‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి అంశంపైనైనా ధైర్యంగా మాట్లాడే స‌త్తా ఉన్న న‌టి

By:  Tupaki Desk   |   25 Oct 2023 3:30 PM GMT
ఇజ్రాయెల్ రాయబారి తో ఆ హీరోయిన్ మంత‌నాలు!
X

బాలీవుడ్ డ్యాష్ అండ్ డేరింగ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ప్ర‌క‌ట‌న‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి అంశంపైనైనా ధైర్యంగా మాట్లాడే స‌త్తా ఉన్న న‌టి. కాంట్ర‌వ‌ర్శీ ఉన్న అంశాలపై సైతం త‌న‌దైన శైలిలో గ‌ళం వినిపిస్తుంది. తాజాగా కంగ‌న ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్ర‌క‌టించింది. ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబారి నార్ గిలాన్ తో ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాయబారితో తన సంభాషణ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజా పరిస్థితులపై ఆమె ఆ దేశ రాయబారితో చర్చించింది. 'నా హృదయం ఇజ్రాయెల్ చుట్టూనే తిరుగుతోంది. మా హృదయాలు రక్తమోడుతున్నాయి' అంటూ వీడియో క్లిప్ ను పోస్ట్ చేసింది. 'ఇజ్రాయెల్ కు- యూదులకు నా మద్దతుపై నేను ఎప్పుడూ బహిరంగంగానే మాట్లాడుతాను. హిందువులు శతాబ్దాలుగా మారణ హోమం ఎదుర్కొంటున్న మాదిరే యూదులకూ అదే పరిస్థితి ఎదురవుతోంది. భారత్ హిందువులకు ఎలా ప్రత్యేకమే.. యూదులకు కూడా ప్రత్యేక దేశం ఉండాల్సిందే' అని అన్నారు.

హమాస్ ను రావణాసురగా అభివర్ణించింది. 'నేడు ఇజ్రాయెల్- భారత్ ఉగ్రవాదంపై పోరాడుతున్నాయి. రావణ దహనం కోసం నేను నిన్న ఢిల్లీకి రాగా.. ఇజ్రాయెల్ ఎంబసీకి వెళ్లి.. నేటి కాలపు రావణ.. హమాస్ వంటి ఉగ్రవాదులతో పోరాడుతున్న ఇజ్రాయెలీలతో భేటీ అవ్వాలనుకున్నాను. చిన్నారులు.. మహిళలను లక్ష్యంగా చేసుకోవడం హృదయాలను పిండేస్తోంది. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుంద న్న నమ్మకం నాకు ఉంది' అని అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఇక కంగ‌న న‌టిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 'ఎమ‌ర్జన్సీ' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతుంది. మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ ఎమ‌ర్జెన్సీ కాలం నాటి ప‌రిస్థితుల్ని ఆధారంగా చేసుకుని చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఇందిర‌మ్మ ఆహార్యంలో కంగ‌న అచ్చు గుద్దిన‌ట్లు ఉన్న పోస్ట‌ర్లు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇత‌ర ప్ర‌చార చిత్రాలు సినిమాపై భారీ అంచ‌నాలు తీసుకొస్తున్నాయి.