Begin typing your search above and press return to search.

దేశం కోసం కంగ‌న తిరిగివ్వ‌డానికి సిద్దంగా

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ప్ర‌త్య‌క్ష‌ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తుందంటూ...వ‌చ్చేసిందంటూ ఇప్ప‌టికే చాలాసార్లు మీడియా క‌థ‌నాలు వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Feb 2024 1:30 AM GMT
దేశం కోసం కంగ‌న తిరిగివ్వ‌డానికి సిద్దంగా
X

ఇప్ప‌టికే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీ తో క‌లిసి ఏపీలో వార్ కి సిద్ద‌మ‌య్యాడు. అటు త‌ల‌ప‌తి విజ‌య్ సైతం 2026 ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేస్తున్నాడు. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి కూడా ఈసారి సినిమా న‌టుడే అవుతాడ‌ని తెలుస్తోంది. క‌రుణానిధి మ‌న‌వ‌డు ఉద‌య‌నిధి స్టాలిన్ డీఎంకే పార్టీ నుంచి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య త‌గ్గాప్ వార్ ఉంటుంద‌ని గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి.

మ‌రి ఇలాంటి వేడి వాతావ‌ర‌ణం బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ కూడా రాజకీయాలు మొద‌లు పెడు తుందా? అంటే అవున‌నే బ‌ల‌మైన సంకేతాలు అందేస్తున్నాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు చూస్తుం టే ఏదో పార్టీ నుంచి బ‌రిలోకి దిగేట‌ట్లే క‌నిపిస్తోంది. బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ప్ర‌త్య‌క్ష‌ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తుందంటూ...వ‌చ్చేసిందంటూ ఇప్ప‌టికే చాలాసార్లు మీడియా క‌థ‌నాలు వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే.

ర‌క‌ర‌కాల నియోజ‌క‌ వ‌ర్గాల నుంచి ఆమె పోటీ చేస్తుంద‌ని గెస్సింగ్స్ సైతం తెర‌పైకి వ‌చ్చాయి. బీజేపీ పార్టీకి అనుకూలంగానూ ఆమె ఉందంటూ..అదే పార్టీలో చేరుతుందంటూ చాలా కాలంగా ప్ర‌చారం సాగుతుంది. ఆ పార్టీని ఉద్దేశించి గ‌తంలో ఆమె చేసిన పోస్టులు కూడా మ‌ద్ద‌తిచ్చిన‌ట్టుగానే క‌నిపించింది. తాజాగా కంగ‌నా ర‌నౌత్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

'నేను దేశం కోసం ఎంతో చేసాను. సినిమా సెట్ నుంచి రాజ‌కీయాల‌తో పోరాడాను. జాతీయ‌వాదిగా గుర్తింపు సంపాదించుకున్నాను. రెండు ద‌శాబ్ధాల న‌టికంటే జాతీయ‌వాదిగానే అంద‌రికీ తెలిసాను. ఒక‌వేళ నేను రాజ‌కీయాల్లోకి రావాలి అంటే అందుకు ఇదే స‌రైన స‌యంగా భావిస్తున్నాను.

దేశంలో అన్ని ప్రాంతా ల‌తో మంచి అనుబంధం ఉంది. నార్త్ నుంచి సౌత్ కి వ‌చ్చి సినిమాలు చేసాను. ఝాన్సీ రాణి వంటి శ‌క్తివంత‌మైన పాత్ర‌లోనూ న‌టించాను. ప్ర‌జ‌లు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. దేశం నాకు చాలా ఇచ్చింది..అదే దేశానికి తిరిగి నేను ఇవ్వ‌డం నా బాధ్య‌త‌. న‌న్ను అభిమానించే వారికి ఎప్పుడు రుణ‌ప‌డే ఉంటాను అని అన్నారు.