Begin typing your search above and press return to search.

ఇండియా - భారత్.. కంగనా ఏం చెప్పిందంటే..

ఈ క్రమంలోనే బాలీవుడ్​ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ స్పందిస్తూ.. భారత్​గా పేరు మార్చడానికి తాను మద్దతు పలుకుతున్నట్లు తెలిపింది.

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:07 PM GMT
ఇండియా - భారత్.. కంగనా ఏం చెప్పిందంటే..
X

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 'భారత్‌' అంశంపైనే పెద్ద చర్చే నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం.. 'ఇండియా' పేరును 'భారత్‌'గా మార్చబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. వారంతంలో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో విదేశీ నేతలకు రాష్ట్రపతి పంపిన విందు ఆహ్వాన పత్రంలో ఇండియాకి బదులుగా భారత్‌ అని రాసి ఉండటం, విదేశీ అతిథులకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాల్లోనూ ఇండియా అని కాకుండా భారత్‌ అని ప్రస్తావించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. అయితే ఈ అంశంపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్​ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ స్పందిస్తూ.. భారత్​గా పేరు మార్చడానికి తాను మద్దతు పలుకుతున్నట్లు తెలిపింది. "కొంతమంది ఈ పేరు మార్చడాన్ని దురుద్దేశంతో చూస్తున్నారు. కానీ ఇది తెలివైనదని నా అభిప్రాయం. ప్రతిఒక్కరికీ కంగ్రాజులేషన్స్​. ఇండియా అనే బానిస పేరును నుంచి విముక్తి పొందుతున్నందుకు. జై భారత్"​ అని కంగనా పేర్కొంది.

ఇండియా అనే పేరుకు ములాలు ఏంటని, దాని ప్రాముఖ్యత ఏంటని ప్రశ్నించింది కంగన. 'సింధు అనే నది పేరును ఇండస్​గా మార్చారు. అలానే Hindosను Indosగా మార్చారు. ఇలాంటి అంశాలే ఇండియా అనే రావడానికి దారీ తీశాయి' అని చెప్పింది. ఇతిహాస పురాణం మహాభారత నుంచి భారత్​ పేరను హైలైట్​ చేస్తూ.. ఈ పేరు ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉందని నొక్కి చెప్పింది. ఇండియాకు అలాంటి అర్థం ఏమీ లేదని పేర్కొంది.

ఇండియన్​ అనే పదానికి అర్థం బానిస అని, దాన్ని బ్రిటీష్ వారు పెట్టారని, డిక్షనరీలుకూ అవే అర్థాన్ని చెబుతున్నాయని చెప్పిన కంగన.. దేశ ప్రజలకు సరైన గుర్తింపు భారతీయులు అని అనడమేనని, ఇండియన్స్​ కాదని చెప్పింది.

ఇకపోతే ప్రస్తుతం కంగనా రనౌత్​.. చంద్రముఖి 2 సినిమాలో నర్తకీగా నటించింది. గతంలో హిట్ సినిమా చంద్రముఖికి సీక్వెల్​గా రాబోతుంది. ఇందులో లారెన్స్​ హీరోగా నటించారు. రీసెంట్​గా విడుదలైన ట్రైలర్ పర్వాలేదనిపించిద. యాక్షన్​-కామెడీ సీన్స్​తో ఈ ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 15న సినిమా రిలీజ్ కానుంది.