Begin typing your search above and press return to search.

మేడం కి సౌత్ క‌లిసి రావ‌డం లేదే!

ఆ ర‌కంగా అమ్మ‌డు ఆరంభంలోనూ మూడు భాష‌ల్లోనూ ప‌రిచ‌య‌మైంది. అయితే స్థిర‌ప‌డింది మాత్రం బాలీవుడ్ లోనే.

By:  Tupaki Desk   |   4 Oct 2023 2:30 AM GMT
మేడం కి సౌత్ క‌లిసి రావ‌డం లేదే!
X

బాలీవుడ్ క్వీన్ కంగ‌నార‌నౌత్ కి దక్షిణాది ప‌రిశ్ర‌మ క‌లిసి రావ‌డం లేదా? కోలీవుడ్..టాలీవుడ్ రెండు భాష‌ల్లోనూ అదే ప‌రిస్థితా? బాలీవుడ్ త‌ర‌హాలో క్వీన్ ఇక్క‌డ ఏల‌డం క‌ష్ట‌మేనా? అంటే అవుననే అనిపిస్తోంది. 'గ్యాంగ్ స్ట‌ర్' తో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన బ్యూటీ నాలుగైదు సినిమాల అనంత‌రం కోలీవుడ్ లో 'ధామ్ దూమ్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అటు పై మ‌రో నాలుగైదు హిందీ సినిమాలో చేసి 'ఏక్ నిరంజ‌న్' తో టాలీవుడ్ లో లాంచ్ అయింది.

ఆ ర‌కంగా అమ్మ‌డు ఆరంభంలోనూ మూడు భాష‌ల్లోనూ ప‌రిచ‌య‌మైంది. అయితే స్థిర‌ప‌డింది మాత్రం బాలీవుడ్ లోనే. తెలుగు..త‌మిళ్ లో అమ్మ‌డు సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేసింది లేదు. ఈక్ర‌మంలో బాలీవుడ్ లో మ‌రింత బిజీ అయింది. న‌టిగా అంచ‌లంచెలుగా ఎదిగి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కిచుకుంది. మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీలో హీరోల ఇమేజ్ కి పోటీగా కెరీర్ ని బిల్డ్ చేసుకుంది. ఆ ర‌కంగా బాలీవుడ్ లో కంగ‌న స్థానం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.

అయితే అదే రేంజ్ లో సౌత్ లోనూ అమ్మ‌డు స‌త్తా చాటాల‌ని మ‌ళ్లీ ఓ ప్ర‌య‌త్నం చేసింది. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో న‌టించే సాహ‌సం చేసింది. అమ్మ పాత్ర‌తో కోలీవుడ్ లోనూ చ‌క్రం తిప్పాల‌ని సీరియ‌స్ గానే శ్ర‌మించింది. 'త‌లైవి' టైటిల్ తో అమ్మ జీవిత క‌థ‌లో న‌టించింది. కానీ ఆ సినిమా ఫ‌లితం తీవ్ర నిరాశ‌ని మిగిల్చింది. అటుపై రెండేళ్ల గ్యాప్ అనంత‌రం సౌత్ ఇండ‌స్ట్రీని షేక్ చేసిన 'చంద్ర‌ముఖి' ప్రాంచైజీలోకి ఎంట్రీ ఇచ్చింది.

అదే 'చంద్ర‌ముఖి-2' లో నేరుగా చంద్ర‌ముఖి పాత్ర‌లో న‌టించిన సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఈసినిమా కూడా ప్ర‌తికూల ప‌రిస్థితుల్నే సృష్టించింది. ఈ సినిమాతోనైనా త‌మిళ..తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌ర‌వ్వాల‌ని చేసిన ప్ర‌య‌త్నం ఇది. కానీ ఫ‌లితం తారుమారైంది. ఆ ర‌కంగా మ‌రోసారి ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో అమ్మ‌డికి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఇక తెలుగులో కంగ‌న‌కి అవ‌కాశాలు వ‌స్తున్నాయా? లేదా? అర్ధం కాని స‌న్నివేశం. 'ఏక్ నిరంజ‌న్ -2' చేస్తే ప్ర‌భాస్ తో మ‌ళ్లీ న‌టిస్తారా? అంటే త‌ప్ప‌కుండా అంటూ ప్రామిస్ చేసింది. కానీ కంగ‌న ని ద‌క్షిణాది వైఫ‌ల్యాలు కంగ‌రు పెడుతున్నాయి! అన్న‌ది మ‌రో వాద‌న‌.