Begin typing your search above and press return to search.

ఈ చంద్రముఖి భయపెట్టేలా లేదే..?

చంద్రముఖి అంటే భయపెట్టాలి కదా, మరీ చంద్రముఖి ఏంటి ఇంత అందంగా కనపడుతోంది అనే కామెంట్స్ వినపడుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 Aug 2023 6:34 AM GMT
ఈ చంద్రముఖి భయపెట్టేలా లేదే..?
X

చంద్రముఖి సినిమా వచ్చి రెండు దశాబ్దాలు అవుతోంది. కానీ, ఆ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. రజినీకాంత్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా దీని ని చెప్పొచ్చు. ఈ మూవీ ని అప్పట్లో అన్నిభాషల్లోనూ చిత్రీకరించారు. ఈ మూవీకి సీక్వెన్స్ గా నాగవల్లి తీశారు. రజినీకాంత్ నటించడానికి అంగీకరించకపోవడంతో, వెంకటేష్ నటించారు. కానీ అది అస్సలు ఆకట్టుకోలేదు. కాగా..ఇప్పుడు మళ్లీ చంద్రముఖి 2 పేరిట సీక్వెల్ తీస్తున్నారు.


దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ సినిమా కు సీక్వెల్‌ తెరకెక్కుతుండటం విశేషం. లారెన్స్‌ , కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే, చంద్రముఖి మూవీ అనగానే రజినీకాంత్ ఎంత గుర్తుకు వస్తాడో. జ్యోతిక కూడా వెంటనే గుర్తుకు వస్తుంది. చంద్రముఖి పాత్రలో జ్యోతిక నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఆమె తన నటనతో అందరినీ భయపెట్టింది కూడా. ఇప్పటికీ ఆ మూవీ చూసినా, జ్యోతిక నటన కు భయపడతారు.

అయితే, తాజాగా సీక్వెన్స్ మూవీ లో ఆ పాత్రలో కంగనా నటిస్తోంది. కంగనా పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో కంగనా చాలా అందంగా కనపడుతోంది. చంద్రముఖి అంటే భయపెట్టాలి కదా, మరీ చంద్రముఖి ఏంటి ఇంత అందంగా కనపడుతోంది అనే కామెంట్స్ వినపడుతున్నాయి. మరి పోస్టర్ లో అందంగా కనపడుతోంది, సినిమా లో భయపెట్టే అవకాశం ఉందనే కామెంట్స్ వినపడుతున్నాయి. చూడాలి మరీ, జ్యోతిక ను మించి కంగనా భయపెడుతుందో లేదో.

ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం ఈ మూవీ నుంచి లారెన్స్ లుక్ ని విడుదల చేశారు. లారెన్స్ రాజు గెటప్ లో కనిపిస్తున్నారు. రాజసం ఉట్టిపడేలా ఆయన లుక్ ఉంది. అయితే, రజినీకాంత్ లా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు అనే కామెంట్స్ వినపడుతున్నాయి. లారెన్స్ లుక్ పై కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుంటే, మరి కొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

ఈ సినిమాకి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ఈ సినిమా ను వినాయక చివితి సందర్భంగా సెప్టెంబర్‌ మాసం లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.