Begin typing your search above and press return to search.

ఆ హీరోలు దెయ్యాలు అయితే ఈ హీరో దేవుడు అంట‌!

57 సంవత్సరాల వయస్సులో షారుఖ్ ఖాన్ అద్భుతమైన రీఇన్వెన్షన్ పై తన అభిమానాన్ని వ్యక్తం చేసింది క్వీన్.

By:  Tupaki Desk   |   9 Sep 2023 8:46 AM GMT
ఆ హీరోలు దెయ్యాలు అయితే ఈ హీరో దేవుడు అంట‌!
X

''ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే!'' .. క్వీన్ కంగ‌న ర‌నౌత్ మాట‌లు వింటే ఎవ‌రికైనా ఇలాంటి సందేహాలు త‌లెత్త‌క మాన‌వు. ఫ‌లానా హీరో బ‌క‌రా అంటూ సూటిగా కామెంట్లు చేయ‌డం కంగ‌న‌కే చెల్లింది. స్టార్ హీరోలు స్టార్ డైరెక్ట‌ర్లు స్టార్ ప్రొడ్యూస‌ర్లు.. ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌దు ఈ బొమ్మాళీ. హృతిక్ రోష‌న్.. ర‌ణ‌బీర్ క‌పూర్.. ర‌ణ‌వీర్ సింగ్.. క‌ర‌ణ్ జోహార్.. య‌ష్ చోప్రా.. మ‌హేష్ భ‌ట్.. భ‌న్సాలీ ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌దు కంగ‌న‌. అలాంటిది ఇప్పుడు ఏకంగా కింగ్ ఖాన్ షారూఖ్ ని 'దేవుడు' అంటూ పొగిడేయ‌డం విశేషం. అత‌డు సినిమా దేవుడు అంటూ ఎంతో ప్రేమ‌గా కీర్తించింది. అంతేకాదు అతడి పోరాటం ఒక మాస్టర్ క్లాస్... అని కూడా కాంప్లిమెంట్ ఇచ్చింది.


అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ 2023 శ్రీ‌కృష్ణ జన్మాష్టమి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా గొప్ప పాజిటివ్ టాక్ తో థియేట‌ర్ల‌లో విజ‌య‌దుందుబి మోగిస్తోంది. ఖాన్ న‌టించిన సినిమా 75 కోట్ల వ‌సూళ్ల‌తో భార‌తీయ సినిమా రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.

ప‌ఠాన్ తో త‌న పేరిట ఉన్న రికార్డుల‌ను కూడా ఖాన్ బ్రేక్ చేసాడు. కింగ్ ఖాన్ జ‌వాన్ సాధించిన విజ‌యం ద‌రిమిలా సినీదిగ్గ‌జాలు ఒక్కొక్క‌రుగా పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సైతం కింగ్ ఖాన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

ఇప్పుడు క్వీన్ కంగనా రనౌత్ వంతు. ఈసారి కంగ‌న స్పంద‌న అనూహ్యం. రొటీన్ గా బాలీవుడ్ అగ్ర హీరోలంటే చిర్రెత్తిపోయే కంగ‌న సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను 'సినిమా దేవుడు' అంటూ కీర్తించింది. అత‌డి పోరాటం ఒక మాస్టర్ క్లాస్...! అని పొగిడేసింది. ఇలాంటి పొగ‌డ్త‌ను అందుకున్న ఖాన్ నిజంగా ధ‌న్యుడు అంటూ ఇప్పుడు అభిమానులు కూడా అంతే స‌ర‌సంగా వ్యాఖ్యానిస్తున్నారు. 57 సంవత్సరాల వయస్సులో షారుఖ్ ఖాన్ అద్భుతమైన రీఇన్వెన్షన్ పై తన అభిమానాన్ని వ్యక్తం చేసింది క్వీన్.

తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో కంగనా 'జవాన్' పోస్టర్‌ను షేర్ చేసి SRK తొంభైలలోని ప్రేమికుడు నుండి.. తన నలభైల చివరి నుండి, యాభైల మధ్యలో తన ప్రేక్షకులతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి దశాబ్దాల పోరాటం వరకు SRK ప్రయాణాన్ని మెచ్చుకుంది. దాదాపు 60 ఏళ్ల వయస్సులో కూడా అతడు అత్యుత్తమ భారతీయ మాస్ సూపర్‌హీరోగా రూపాంతరం చెందడాన్ని కంగ‌న‌ ప్రశంసించ‌కుండా ఆగ‌లేక‌పోయింది. నిజ జీవితంలో అది సూపర్ హీరోయిక్ కి ఎంత‌మ‌త్రం తక్కువ కాదు అంటూ పొగిడేసింది.

SRK స్థిర‌మైన స్టార్ డ‌మ్.. అసాధార‌ణ‌ కృషి ..వినయం.. రీఇన్వెన్షన్.. రీస్టాబ్లిష్‌మెంట్ ఇవ‌న్నీ సుదీర్ఘమైన, విజయవంతమైన కెరీర్‌ను కోరుకునే కళాకారులకు మాస్టర్ క్లాస్‌లాగా ఎలా ఉపయోగపడతాయో కంగ‌న‌ హైలైట్ చేసింది. జవాన్ హిందీలో 65.5 కోట్ల‌తో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెన‌ర్ గా రికార్డులు సృష్టించింది. నిజానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది.

మరోవైపు.. కంగనా రనౌత్ న‌టించిన‌ 'ఎమర్జెన్సీ' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో కంగ‌న‌ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర‌లో న‌టించింది. తేజస్ అనే బ‌యోపిక్ లోను న‌టిస్తోంది. ఇందులో ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషించింది. తమిళ చిత్రం చంద్రముఖి 2లోను కంగ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది.