Begin typing your search above and press return to search.

2025 త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. స్టార్ హీరోయిన్ హెచ్చ‌రిక‌

వ‌రుస ట్రాజిక్ ఘ‌ట‌న‌లు స్టార్ హీరోయిన్ కంగ‌న ర‌నౌత్ ని భ‌య‌పెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   14 Jun 2025 9:33 AM IST
2025 త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. స్టార్ హీరోయిన్ హెచ్చ‌రిక‌
X

వ‌రుస ట్రాజిక్ ఘ‌ట‌న‌లు స్టార్ హీరోయిన్ కంగ‌న ర‌నౌత్ ని భ‌య‌పెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. అహ్మ‌దాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌లో విమానంలోని 241 మంది మ‌ర‌ణించ‌డం, విమానం ప‌డ్డ భ‌వంతిలో 20 మంది పైగా విద్యార్థులు మ‌ర‌ణించడం.. అంత‌కుముందు ఇండియా- పాకిస్తాన్ వార్.. ఇవ‌న్నీ కంగ‌న‌ను క‌ల‌త‌కు గురి చేసాయి.

ఇంత‌లోనే ఇప్పుడు సీనియ‌ర్ న‌టి క‌రిష్మా క‌పూర్ మాజీ భ‌ర్త సంజ‌య్ క‌పూర్ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌న‌లో భ‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. మొద‌ట గుండె నొప్పి కార‌ణంగా సంజ‌య్ మ‌ర‌ణించాడ‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఆ త‌ర్వాత అస‌లు నిజం తెలిసింది. అత‌డు మైదానంలో పోలో ఆడుతుండ‌గా ఒక తేనెటీగ అక‌స్మాత్తుగా అత‌డి గొంతులోకి దూరింది.. గొంతు నాళంలో అది తీవ్రంగా కుట్ట‌డంతో అలెర్జీ కార‌ణంగా శ్వాస‌నాళం మూసుకుపోయింది. ఈ తీవ్ర ప‌రిణామానికి వెంట‌నే అత‌డికి గుండె నొప్పి వ‌చ్చి మ‌ర‌ణించాడు.

ఇది నిజంగా షాకిచ్చే ఘ‌ట‌న‌. అందుకే జ‌ర‌గ‌కూడ‌నివి అన్నీ జ‌రుగుతున్నాయి.. 2025 లో వ‌ర‌స ఘ‌ట‌న‌లు క‌ల‌చి వేస్తున్నాయ‌ని కంగ‌న సోష‌ల్ మీడియాలో ఆందోళ‌న చెందింది. ఈ ఏడాది ఇంకా ఏం జ‌రుగుతాయో.. ఏం చూడ‌బోతున్నామో.. త‌స్మాత్ జాగ్ర‌త్త! అంటూ హెచ్చ‌రించింది. నిజంగానే కంగ‌న హెచ్చ‌రిక‌ను ఒక మేల్కొలుపుగా భావించాలి.

పారిశ్రామికవేత్త సంజ‌య్ క‌పూర్ ఆకస్మిక మరణంతో షాక్‌కు గురైన కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో ఇలా రాసింది. ``మరో నమ్మశక్యం కాని సంఘటన.. సంజయ్ కపూర్ (కరిష్మా కపూర్ మాజీ భర్త) పోలో మైదానంలో ఉన్నప్పుడు, ఒక తేనెటీగ అతని నోటిలోకి వెళ్లి (అవును పోలో మైదానంలో మధమక్కి) అతడిని కుట్టి అతడి శ్వాసనాళాన్ని అడ్డుకుంది. అతడు ఊపిరి ఆడలేకపోయాడు, కాబట్టి అతడు ఆటను ఆపమని కోరాడు.. కానీ వెంటనే గుండెపోటుతో మరణించాడు. ఇంత‌కుముందు క‌రిష్మా క‌పూర్ సోద‌రి క‌రీనా క‌పూర్ భ‌ర్త సైఫ్ అలీఖాన్ పై దుండ‌గుడి క‌త్తి పోట్ల స‌మయంలోను కంగ‌న త‌న‌దైన శైలిలో స్పందించిన సంగ‌తి తెలిసిందే.