Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌ల కోసం జీవితాన్ని త్యాగం చేయ‌లేను

కంగ‌నా ర‌నౌత్. ఈమె గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. ఎప్పుడూ ఏదొక వ్యాఖ్య‌లు చేస్తూ వివాదాల్లో నిలిచే కంగ‌నా ఇప్పుడు త‌న వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.

By:  Tupaki Desk   |   9 July 2025 11:55 AM IST
ప్ర‌జ‌ల కోసం జీవితాన్ని త్యాగం చేయ‌లేను
X

కంగ‌నా ర‌నౌత్. ఈమె గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. ఎప్పుడూ ఏదొక వ్యాఖ్య‌లు చేస్తూ వివాదాల్లో నిలిచే కంగ‌నా ఇప్పుడు త‌న వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. కంగ‌నా ర‌నౌత్ కేవ‌లం బాలీవుడ్ న‌టి మాత్ర‌మే కాదు, బీజీపీ ఎంపీ కూడా. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మండి లోక్‌స‌భ్ నియోజ‌క వ‌ర్గం నుంచి ఎంపీగా గెలిచారు కంగ‌నా.

ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు త‌న రాజ‌కీయ జీవితాన్ని కొన‌సాగిస్తున్న కంగ‌నా రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్ ఇంట‌ర్వ్యూలో పాల్గొని త‌న రాజ‌కీయ జీవితంపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తాను రాజ‌కీయాల్లో కంప్లీట్ గా సెటిల‌వ‌లేద‌ని, ఎంపీగా పోటీ చేసి గెలిచిన‌ప్ప‌టికీ ఆ ప‌ద‌విని, పొలిటిక‌ల్ లైఫ్ ను తాను ఆస్వాదించ‌లేక‌పోతున్న‌ట్టు కంగనా కామెంట్స్ చేశారు.

రాజ‌కీయ రంగం చాలా భిన్న‌మైన‌దని, అది త‌న నేప‌థ్యం కూడా కాద‌ని, మ‌హిళ‌ల హ‌క్కులపై పోరాడిన త‌న దృష్టికి ప్ర‌జ‌లు తీసుకొస్తున్న స‌మ‌స్య‌లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయ‌ని ఆమె తెలిపారు. తాను ఎంపీని అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి పంచాయితీ స్థాయి స‌మ‌స్య‌ల‌ను చెప్తున్నార‌ని, రోడ్లు, నాలాలు బాలేవ‌ని చెప్తుంటార‌ని, త‌మ స‌మ‌స్య‌ రాష్ట్ర ప్ర‌భుత్వం స్థాయిద‌ని చెప్పినా వారు అర్థం చేసుకోవ‌డం లేద‌ని ఆమె తెలిపారు.

పైగా మీ సొంత డ‌బ్బును ఉప‌యోగించి ప్రాబ్ల‌మ్ ను సాల్వ్ చేయ‌మ‌ని ప్ర‌జ‌లు అంటున్నార‌ని కంగ‌నా ర‌నౌత్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అదే సంద‌ర్భంగా మీరు పాలిటిక్స్ లో గొప్ప స్థాయికి వెళ్లాల‌నుకుంటున్నారా? ప్ర‌ధాని కావాల‌నే టార్గెట్ ఏమైనా ఉందా అనే ప్ర‌శ్న‌కు కూడా ఆమె స్పందించారు. తాను ప్ర‌ధాని ప‌ద‌వికి స‌రిపోతాన‌ని అనుకోవ‌డం లేద‌ని, ఆ కోరిక కూడా లేద‌ని, సామాజిక సేవ చేయ‌డం త‌న నేప‌థ్యం కాద‌ని, తాను పూర్తిగా ప్రజాసేవ‌కు డెడికేట్ అయ్యే రకాన్ని కాద‌ని, పైగా ల‌గ్జ‌రీని అనుభ‌వించాల‌నే స్వార్థం కూడా త‌న‌కుంద‌ని ఇవ‌న్నీ చూస్తూ దేవుడు త‌న‌ను ప్ర‌ధాని చేయడ‌ని, అస‌లు ఆ భ‌గ‌వంతుడు ఏ ఉద్దేశంతో త‌న‌ను రాజ‌కీయాల్లోకి పంపాడో కూడా తెలియ‌దని తెలిపిన కంగ‌నా, ప్ర‌జ‌ల కోసం లైఫ్ మొత్తాన్ని త్యాగం చేసే ఉద్దేశం త‌న‌కు లేద‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం కంగ‌నా చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.