కంగన ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా ఈ సినిమాలో కంగనా కనిపించింది.
By: Tupaki Desk | 9 May 2025 1:22 PM ISTనేషనల్ అవార్డు విన్నర్ కంగనా రనౌత్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న కంగనా నుంచి రీసెంట్ గా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసే సినిమాలేవీ రాలేదు. ఎమర్జెన్సీ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సినిమా చేస్తే ఆ సినిమా కంగనా ఆశలపై నీళ్లు చల్లింది.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా ఈ సినిమాలో కంగనా కనిపించింది. ఈ సినిమాలో కంగనా నటనకు మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత కంగన నుంచి మరో సినిమా వచ్చింది లేదు. అయితే ఇప్పుడు కంగన ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది.
బ్లెస్డ్ బి ది ఈవిల్ అనే హాలీవుడ్ సినిమాలో కంగన ఛాన్స్ అందుకున్నట్టు సమాచారం. హార్రర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కంగన టైలర్ పోజీ, స్కార్లెట్ రోజ్ స్టాలోన్ తో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోనుంది. లయన్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ సమ్మర్ లోనే న్యూయార్క్ లో మొదలవనుంది.
ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం యూఎస్ఏలోనే జరుగుతుందట. గతంలో టైలింగ్ పాండ్, న్యూ మీ సినిమాలకు దర్శకత్వం వహించిన అనురాగ్ రుద్ర ఈ బ్లెస్డ్ బి ది ఈవిల్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కోసం పలువురు టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న కంగన కొత్తగా ఏ బాలీవుడ్ సినిమానూ ఒప్పుకుంది లేదు.