రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ సెల్ఫ్ డౌట్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ - ఎంపీ కంగనా రనౌత్ బోల్డ్ స్టేట్‌మెంట్స్ తో నిత్యం వార్తల్తో నిలుస్తుంటారు. విషయం ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతారు.
By: Srikanth Kontham | 10 Jun 2026 7:00 AM ISTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ - ఎంపీ కంగనా రనౌత్ బోల్డ్ స్టేట్‌మెంట్స్ తో నిత్యం వార్తల్తో నిలుస్తుంటారు. విషయం ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతారు. అది సినిమా అంశమైనా? సామాజికి సమస్యైనా? కంగన గళం ఒకేలా ఉంటుంది. భయం. .బెదురు అన్నదే కంగన బ్లడ్ లో లేదని ఎన్నోసార్లు ప్రూవ్ చేసారు. మరి కంగన జీవితంలో భయపడే సంద ర్భాలు లేవా? అంటే ఆమెలో కూడా ఒక సామాన్యురాలి లాగే భయాలు, సందేహాలు ఉంటాయనే విషయాన్ని తాజాగా కంగన అంగీక రించారు. సినిమా రంగాన్ని శాసించిన కంగన సరికొత్తగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను -సెల్ఫ్ డౌట్నుఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
మీరు భయపడే విషయాలు ఎవైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా.. కంగనా ఎంతో నిజాయితీగా సమాధానమిచ్చారు.భయం అంటే ఏదో ఊహాజనితమైన పెద్ద విషయం కాదని.. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సందేహాలే మనుషులను భయపెడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఎంపీగా కొత్త బాధ్యతలను నిర్వహి స్తున్నప్పుడు ..`నేను ఈ పదవికి న్యాయం చేయగలనా? ప్రజాప్రతినిధిగా నేను నడుచుకుంటున్న తీరు సరైనదేనా? అనే ప్రశ్నలు తరచూ వేధిస్తుంటాయి. వీటి విషయంలో కాస్త ఆందోళన చెందుతుంటానన్నారు.
గ్లామర్ ప్రపంచం నుండి రాజకీయాల్లోకి రావడం వల్ల బాహ్య రూపురేఖల విషయంలో కూడా తాను ఎన్నో అపోహలకు లోనవుతున్నట్లు కంగనా వెల్లడించారు. `నేను ఇంకా ఒక హీరోయిన్ లాగే కనిపిస్తున్నానా? రాజకీయ నాయకురాలిగా నేను మితిమీరి తయారవుతున్నానా? ఒకవేళ స్లీవ్‌లెస్ దుస్తులు ధరిస్తే ప్రజలు నన్ను తప్పుగా జడ్జ్ చేస్తారా? వంటి అనుమానాలు మనసులోకి వస్తుంటాయన్నారు. కొత్త రంగాన్ని ఎంచుకున్నప్పుడు ఎవరికైనా ఇలాంటి అనిశ్చితి, అభద్రతాభావం ఏర్పడటం సహజమేనని కంగన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం కంగన సినిమాల్లో నటిస్తూనే ఎంపీగా బాద్యతలు నెరవర్తిస్తున్నారు. కంగన ప్రధాన పాత్రలో `భారత్ భాగ్య విధాత` అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడుల నేపథ్యంలో.. కామా అండ్ ఆల్బ్లెస్ హాస్పిటల్‌లోని 400 మంది రోగుల ప్రాణా లను కాపాడిన వైద్య సిబ్బంది.. నర్సులు .. వార్డ్ బాయ్స్ వాస్తవ గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కంగన నర్సు పాత్ర పోషించారు. ఒక నర్సు ఉగ్రవాదానికి ఎదురొడ్డి నిలిచిన ఆ సాధారణ శ్రమజీవుల కథను వెండితెరపై ఆవిష్క రించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు కంగన తెలిపారు. దేశభక్తికి నిలువెత్తు రూపమైన ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు.
