Begin typing your search above and press return to search.

బాలీవుడ్ అవార్డుల కంటే చీరే గొప్ప‌ది

ప్ర‌స్తుతం ఎమ‌ర్జెన్సీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండ‌గా, ఆ సినిమాను చూసి నిత్యానందం అనే అభిమాని కంగ‌న న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు.

By:  Tupaki Desk   |   5 April 2025 7:32 PM IST
బాలీవుడ్ అవార్డుల కంటే చీరే గొప్ప‌ది
X

ప్ర‌భాస్ తో క‌లిసి ఏక్ నిరంజ‌న్ సినిమా చేసిన కంగ‌న ర‌నౌత్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో న‌టించిన కంగ‌నా ఎప్పుడూ ఏదొక వివాదంలో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగ‌నా స్వీయ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తూ న‌టించిన సినిమా ఎమ‌ర్జెన్సీ.


భార‌త మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద మిక్డ్స్ టాక్ ను తెచ్చుకుంది. ఎన్నో వివాదాలు ఎదుర్కొని చాలా స‌మ‌స్య‌ల త‌ర్వాత జ‌న‌వ‌రి 17న ఎమ‌ర్జెన్సీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై ప‌లువురు భిన్న అభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌గా, కంగ‌నా మాత్రం ఎమ‌ర్జెన్సీకి ఆడియ‌న్స్ ప్ర‌శంస‌లు ద‌క్కాయ‌ని ముందునుంచి చెప్పుకుంటూనే వ‌స్తోంది.

ఎమ‌ర్జెన్సీ సినిమాలో టైటిల్ రోల్ లో న‌టించిన కంగ‌నా ఆ సినిమాలో త‌న న‌ట‌నతో మంచి పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఎమ‌ర్జెన్సీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండ‌గా, ఆ సినిమాను చూసి నిత్యానందం అనే అభిమాని కంగ‌న న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఎమ‌ర్జెన్సీ లాంటి ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్ ను ఎంతో ధైర్యంగా చూపించినందుకు కంగ‌నాని మెచ్చుకుంటూ ఓ లెట‌ర్ రాశారు.

కంగ‌నాను మెచ్చుకుంటూ అత‌ను ఆమెకు ఓ కాంచిపురం చీర‌ను కూడా గిఫ్టుగా పంపాడు. ఈ విష‌యాన్ని కంగ‌నా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఎమ‌ర్జెన్సీ సినిమాను తీసినందుకు తాను అద్భుత‌మైన శారీని గిఫ్టుగా పొందాన‌ని, ప‌నికిమాలిన ఎన్నో ట్రోఫీల కంటే ఈ చీర ఎంతో బెట‌ర్ అని కంగనా ఈ పోస్ట్ లో రాసుకొచ్చింది. బాలీవుడ్ లో ప్ర‌ధానం చేసే ప‌లు అవార్డులపైనే కంగనా ఈ కామెంట్స్ చేసింద‌నే విష‌యం స్పెష‌ల్ గా చెప్పే ప‌న్లేదు. కంగ‌నా గ‌తంలో కూడా ఎన్నోసార్లు బాలీవుడ్ లో ఇచ్చే అవార్డుల‌పై మాట్లాడింది. అర్హ‌త ఉన్న వారికి ఎప్పుడూ అవార్డులు ఇవ్వరని, అవార్డుల విష‌యాల్లో కూడా నెపోటిజం ఉంటుంద‌ని కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే.