Begin typing your search above and press return to search.

కన్నప్ప సినిమాపై రివ్యూ ఇచ్చిన మనోజ్.. ఏమన్నారంటే..

ముఖ్యంగా సినిమా చివరి 20 నిమిషాలు ఎమోషనల్‌గా ఎంతో బాగా కుదిరాయని తెలిపారు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 2:00 PM IST
కన్నప్ప సినిమాపై రివ్యూ ఇచ్చిన మనోజ్.. ఏమన్నారంటే..
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ ఈరోజు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ యాక్టర్స్ పాల్గొనడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూవీ రిలీజ్ సందర్భంగా మానేజ్‌మెంట్ ప్రివ్యూలు, సెలెబ్రిటీల స్పందనలు ఒక దాని తర్వాత ఒకటి వస్తుండగా, తాజాగా మంచు మనోజ్ కూడా థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తన అభిప్రాయం వెల్లడించాడు.

ఈరోజు ఉదయం మనోజ్ ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లి కన్నప్ప సినిమా చూసారు. సినిమా చూశాక మీడియాతో మాట్లాడిన ఆయన "ఊహించినదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. అన్న కూడా ముఖ్యంగా ప్రభాస్ సీన్ వచ్చాక సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయింది..అలాగే అన్న కూడా ఇంత బాగా యాక్ట్ చేస్తాడని ఊహించలేదు" అంటూ వివరణ ఇచ్చారు. హీరో విష్ణు మీద కూడా పాజిటివ్ గా స్పందిస్తూ తన రివ్యూలో ప్రభాస్, మోహన్ బాబు నటనపై కూడా ప్రశంసలు కురిపించారు.

ముఖ్యంగా సినిమా చివరి 20 నిమిషాలు ఎమోషనల్‌గా ఎంతో బాగా కుదిరాయని తెలిపారు. “ఆ క్లైమాక్స్ సీన్స్ నన్ను భావోద్వేగానికి గురిచేశాయి. ప్రభాస్ అలా నటిస్తారని అస్సలు ఊహించలేదు. ఆయన నటన చూస్తుంటే గర్వంగా అనిపించింది” అని మనోజ్ చెప్పుకొచ్చారు. ఆయన ఈ సినిమా భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

తండ్రి మోహన్ బాబు పాత్ర గురించి మాట్లాడుతూ.. "నాన్నగారు ఎప్పటిలాగే అద్భుతంగా చేశారు. ఆయన్ని తెరపై చూస్తుంటే గర్వంగా అనిపించింది. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు" అని మనోజ్ పేర్కొన్నారు. అలాగే సినిమా తీసిన ముకేష్ కుమార్ సింగ్‌, మ్యూజిక్, విజువల్స్ అందించిన టీమ్‌ను ప్రశంసించారు.

విడుదలకు ముందు రోజు విష్ణుపై మాత్రం స్పష్టంగా ఎటువంటి కామెంట్స్ చేయకుండా, ఇతర నటీనటులపై మాట్లాడిన మనోజ్ నేడు సినిమా చూసిన అనంతరం పాజిటివ్ గా స్పందించారు. అన్నయ్య బాగా నటించారని చెప్పడం విశేషం. ఇక ఈ సినిమా విజయం అనంతరం, మంచు ఫ్యామిలీలో పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి. మొత్తంగా మనోజ్ సమీక్ష మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.