Begin typing your search above and press return to search.

కన్నప్ప మేకింగ్ వీడియో చూశారా..?

మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   21 Jun 2025 7:57 PM IST
కన్నప్ప మేకింగ్ వీడియో చూశారా..?
X

మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. సినిమాలో అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు వంటి స్టార్స్ అంతా కూడా భాగం అయ్యారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆస్క్తి పెంచగా లెటెస్ట్ గా సినిమా నుంచి ఒక మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.

కన్నప్ప సినిమాకు చిత్ర యూనిట్ పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫారిన్ లో చేసిన షూట్ ఇంకా సినిమాలో మిగతా స్టార్స్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ చూపించారు. మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటించాడు. మేకింగ్ వీడియోలో ప్రభాస్ తో మంచు విష్ణు సరదా సంభాషణలు చూపించారు. మేకింగ్ వీడియో చూస్తుంటేనే సినిమా కోసం యూనిట్ ఎంత కష్టపడ్డారు అన్నది తెలుస్తుంది.

మంచు విష్ణు ఈ సినిమా కోసం చాలా ఫోకస్ తో పనిచేశాడు. సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ ప్రమోషన్స్ వరకు అంతా కూడా తన బెస్ట్ అందిస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కన్నప్ప సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. నేడు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ప్రభాస్ తో పాటు సినిమాలో నటించిన మిగతా స్టార్స్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారని తెలుస్తుంది.

కన్నప్ప కథను ప్రేక్షకులకు చెప్పాలనుకున్న మంచు విష్ణు ఆ సినిమా కోసం తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. సినిమాలో హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా తన బాధ్యత నిర్వర్తించాడు. ఈ నెల 27న రిలీజ్ అవుతున్న కన్నప్ప సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. సినిమాలో ప్రభాస్ నటించడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా కన్నప్ప మీద మంచి అంచనాలతో ఉన్నారు. మంచు విష్ణు అయితే సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కన్నప్ప సినిమాకు మంచి రిలీజ్ టైం దొరికింది. సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.