Begin typing your search above and press return to search.

క‌ళాకారుల ధ‌ర్మంపై త‌త్వం భోధించిన కంగ‌న‌

ఇంత‌లోనే ఇప్పుడు క‌ళాకారుని గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది కంగ‌న‌. ఈ భామ‌ తన ఇన్‌స్టాలో తన అభిమానుల కోసం స్ఫూర్తి నింపే నోట్ ని షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 2:30 AM GMT
క‌ళాకారుల ధ‌ర్మంపై త‌త్వం భోధించిన కంగ‌న‌
X

కొంద‌రిలో తాత్విక‌త పుట్టుక‌తోనే అబ్బుతుంది. బ్ల‌డ్ లో అది ఉంటుంది. కానీ మ‌రికొంద‌రిలో మ‌ధ్య‌లో ప్ర‌వేశిస్తుంది. ఈ రెండో కేట‌గిరీకే చెందుతుంది క్వీన్ కంగ‌న‌. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల నాయిక‌గా కొన‌సాగిన రోజుల్లో, స్టార్ హీరోల‌తో స్నేహం చేసిన రోజుల్లో ఎలాంటి త‌త్వాన్ని భోధించేందుకు సాహ‌సించ‌ని కంగ‌న ఇటీవ‌లి కాలంలో రూటు మార్చి త‌త్వాన్ని భోధిస్తోంది. ఇటీవ‌లే కృష్ణ త‌త్వాన్ని భోధించింది. హ‌రేకృష్ణ నామ‌జ‌పం చేస్తూ ఒక హీరోని కించ‌ప‌రుస్తూ మాట్లాడింది.

ఇంత‌లోనే ఇప్పుడు క‌ళాకారుని గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది కంగ‌న‌. ఈ భామ‌ తన ఇన్‌స్టాలో తన అభిమానుల కోసం స్ఫూర్తి నింపే నోట్ ని షేర్ చేసింది. నమ్మశక్యం కాని వాటిని నమ్మే గొప్ప కళాకారుల గురించి కంగ‌న గొంతెత్తింది. ఇన్ స్టా పోస్ట్ లో కంగనా ఏమని రాసింది అంటే..! "మనం మన హృదయాన్ని ఎంత ఎక్కువగా అనుసరిస్తామో.. మనం చేయాలనుకున్నది ఎంత‌గా చేస్తామో క‌దా! అయినా మనం ఏ దిశలో వెళ్లినా మన విధిని చేరుకోవడానికి డెస్టినీ ముందే నిర్ణయ‌మైందని మనం గ్రహిస్తాము. కాబట్టి ఈ కార్యాచరణ అంతా ఏమిటి? క‌చ్చితంగా వీటన్నింటికీ ఒక పాయింట్ ఉంది. ఈ అంతులేని పాయింట్ల మాతృక లేకుండా ప్రారంభించాల్సిన పని లేదని ఎప్పటికీ గుర్తించలేరు" అని తాత్వికంగా మాట్లాడింది.

ఒకానొక సమయంలో ఇళ్లు, బట్టలు, ఉద్యోగాలు, వ్యక్తులు, అన్ని రకాల అనుభవాలు చాలా ముఖ్యమైనవిగా అనిపించేవి. తర్వాతి మలుపులో అవ‌న్నీ అనవసరంగా మారతాయి. అయితే మనం మరింత ఎక్కువగా ఆశిస్తూ, ప్రార్థిస్తూ ఇంకా ఇంకా కోరుతూనే ఉంటాము. ఈ చ‌క్రం ఎక్క‌డో మొదలవుతుంది. పునరావృతం అయినప్పుడు అదే చక్రం రిపీటైంద‌ని స్పష్టంగా చెప్పగ‌లం. కాబట్టి వీటన్నింటి ప్రయోజనం ఏమిటి? అదే షో రిపీటెడ్‌గా ఉంది.., ఇలాంట‌ప్పుడు మ‌నిషి ఏం చేయాలి?" అని నోట్ లో ప్ర‌శ్నించింది.

అంతిమంగా క‌ళాకారుల‌కు అద్భుత స‌ల‌హా కూడా ఇచ్చింది కంగ‌న‌. "పై ప్ర‌శ్న‌కు సమాధానం ఏమిటంటే, మొదటి సారి లేదా ప్రతిసారీ అదే ప్రదర్శన అయినప్పటికీ కళాకారులు దానిని పరిపూర్ణంగా ప్రదర్శించాలి. గొప్ప కళాకారులు చేసేది అదే.. వారు నమ్మశక్యం కాని వాటిని నమ్ముతారు" అని తెలిపింది. అంతేకాదు క‌ళాకారులంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంది క్వీన్.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కంగనా తదుపరి 'చంద్రముఖి 2'లో కనిపించనుంది. ఇది సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తున్న 'ఎమర్జెన్సీ' కూడా విడుద‌ల కావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కంగ‌న స్వీయ నిర్మాణ‌ దర్శకత్వంలో తెర‌కెక్కిస్తోంది. దీనికోసం త‌న ఆస్తుల‌న్నిటినీ తాక‌ట్టు కూడా పెట్టింది. కంగన 'తేజస్' అనే చిత్రంలోను న‌టిస్తోంది. ఈ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపించనుంది.