Begin typing your search above and press return to search.

కమ్ముల.. నెవ్వర్ బిఫోర్ కాన్సెప్ట్

ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శేఖర్ కమ్ముల ఈసారి ఓ డిఫరెంట్ జానర్ ని టచ్ చేయబోతున్నారట.

By:  Tupaki Desk   |   19 Jan 2024 12:58 PM GMT
కమ్ముల.. నెవ్వర్ బిఫోర్ కాన్సెప్ట్
X

టాలీవుడ్ లో క్లాస్ డైరెక్టర్ గా తనకంటూ సపరేట్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు శేఖర్ కమ్ముల. ఈయన సినిమాలను ఇష్టపడని ఆడియన్స్ ఉండరు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన కథ, కథనాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ రిలేషన్స్.. వీటి చుట్టే ఆయన సినిమాలు సాగుతూ ఉంటాయి. ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శేఖర్ కమ్ముల ఈసారి ఓ డిఫరెంట్ జానర్ ని టచ్ చేయబోతున్నారట.

ఈసారి కమర్షియల్ పాయింట్స్ తో ఓ సినిమాని తెలకెక్కించబోతున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తనను తాను కొత్తగా మలుచుకోబోతున్నారట శేఖర్ కమ్ముల. ఈసారి మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో సాగే కథతో శేఖర్ కమ్ముల సినిమాని తీస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాగార్జున మాఫియా డాన్ పాత్రలో కనిపిస్తారట.

హాలీవుడ్ వెబ్ సిరీస్ 'మనీ హేస్ట్' తరహాలో ఈ ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. బ్లాక్ మనీ, స్మగ్లింగ్.. వంటి అంశాలతో పూర్తిస్థాయి యాక్షన్ పంథాలో ఈ కథ సాగబోతుందట. శేఖర్ కమ్ముల ఇలాంటి జానెర్ ని ఎప్పుడూ టచ్ చేసింది లేదు. నిజానికి ఆయన నుంచి ఇలాంటి సినిమా వస్తుందంటే ఆశ్చర్యమే. ఆయన సినిమాలు చాలా క్లాస్ గా ఎంతో ఆహ్లాదకరంగా, ఓ మంచి కాఫీలాగా ఉంటాయి.

అలాంటి ఈయన హింస, రక్తపాతంతో కూడిన సినిమా తీస్తున్నారంటే నమ్మశక్యమే కాదు. ఇప్పటివరకు కెరియర్లో లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ తోనే సినిమాను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల దగ్గుబాటి రానాతో 'లీడర్' అనే పొలిటికల్ మూవీ చేశాడు. కానీ సినిమాలో ఒక్క ఫైట్ కానీ, హీరోఇజం చూపించే సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ఏమాత్రం ఉండవు.

జస్ట్ సింపుల్ డైలాగ్స్ తోనే హీరోయిజాన్ని ఎలివేట్ చేశారు. లీడర్ తప్పితే మిగతా సినిమాలన్నీ శేఖర్ కమ్ముల క్లాస్ ట్రీట్మెంట్ తోనే ఉంటాయి. కానీ ఈసారి ధనుష్, నాగార్జునలతో మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. కాగా గురువారమే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారాయణ, పుష్కర్ రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.