Begin typing your search above and press return to search.

క‌మ‌ల్-శ్రుతిహాస‌న్‌ల‌తో క‌న‌గ‌రాజ్ ప్ర‌యోగం?

శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన‌ ఫోటోలో లోకేష్ కనగరాజ్ - శ్రుతిహాస‌న్ ఒక‌రికొక‌రు ఎదురెదురుగా నిలుచుని తీక్ష‌ణంగా ఒక‌రినొక‌రు వీక్షిస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Feb 2024 4:23 AM GMT
క‌మ‌ల్-శ్రుతిహాస‌న్‌ల‌తో క‌న‌గ‌రాజ్ ప్ర‌యోగం?
X

వ‌రుసగా ప్ర‌యోగాలు చేస్తూనే, క‌మ‌ర్షియ‌ల్ గా బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతున్న లోకేష్ క‌న‌గ‌రాజ్ శైలి దేశ‌వ్యాప్తంగా డిబేట‌బుల్ గా మారింది. త‌న‌దైన యూనిక్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయ‌డం లోకేష్ కే చెల్లింది. అత‌డి నుంచి ఇటీవ‌లే వ‌చ్చిన 'లియో' చిత్రంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా కానీ, క‌మ‌ర్షియ‌ల్ గా భారీ వ‌సూళ్ల‌ను సాధించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్ర‌స్తుతం లోకేష్ త‌దుప‌రి ప్రాజెక్ట్ పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. అత‌డు త‌దుప‌రి ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ తో విక్ర‌మ్ సీక్వెల్ ని తెర‌కెక్కించే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ సాగుతోంది. ఇంత‌లోనే శ్రుతిహాస‌న్ షేర్ చేసిన ఓ పోస్ట్ అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన‌ ఫోటోలో లోకేష్ కనగరాజ్ - శ్రుతిహాస‌న్ ఒక‌రికొక‌రు ఎదురెదురుగా నిలుచుని తీక్ష‌ణంగా ఒక‌రినొక‌రు వీక్షిస్తున్నారు. డార్క్ ప్లేస్ లో ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. "ఇనిమెయి దేలులు అనేది న్యూ సోలులు" అని దీనికి శ్రుతి క్యాప్ష‌న్ ని ఇచ్చారు.

దీనిని బ‌ట్టి త‌దుప‌రి లోకేష్ కనగరాజ్ చిత్రంలో శృతి హాసన్ - కమల్ హాసన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించే వీలుంద‌ని అర్థ‌మ‌వుతోంది. క‌మల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ లో లోకేష్ త‌దుప‌రి చిత్రమిది. రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ లో లోకేష్ కనగరాజ్ కి రెండవ సినిమా. గతంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్ ఇదే బ్యాన‌ర్ లో రూపొందింది. ఇంత‌లోనే తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నారనే ప్రకటన ఉత్కంఠ రేపుతోంది. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇప్పుడు శ్రుతిహాస‌న్ కూడా చేరడం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అయితే ఇది విక్ర‌మ్ సీక్వెల్ అవుతుందా? లేక ఇంకేదైనా కొత్త క‌థ‌తోనా? అన్న స‌స్పెన్స్ వీడాల్సి ఉంది.

ప్రభాస్ న‌టించిన‌ ఇటీవలి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం 'సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్‌'లో శ్రుతి క‌థానాయిక‌గా న‌టించింది. ప్ర‌స్తుతం శ్రుతి స‌లార్ భారీ విజయాన్ని ఆస్వాధిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు 700 కోట్ల రూపాయలు పైగా వ‌సూలు చేసింది. త‌దుప‌రి అడివి శేష్‌తో కలిసి 'డకాయిట్'లోను శ్రుతి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.